10 నెలల్లో 44 కిలోల బరువు తగ్గిన మహిళ.. ఎలా సాధ్యమైందంటే..

చాలామంది వ్యక్తులు వారి బరువు గురించి ఆందోళన చెందుతారు.

Update: 2024-03-16 14:29 GMT

దిశ, ఫీచర్స్ : చాలామంది వ్యక్తులు వారి బరువు గురించి ఆందోళన చెందుతారు. సరళంగా చెప్పాలంటే అధిక బరువు ఉన్న వ్యక్తి లేదా సన్నగా ఉన్న వ్యక్తి తన బరువుని చూసుకుని అస్సలు సంతోషంగా ఉండరు. సన్నగా ఉండేవారు కాస్త బరువు పెంచుకుని కాస్త ఫిట్ గా మారాలని ఎప్పుడూ అనుకుంటుంటారు. కాస్త ఎక్కువ బరువు ఉన్నవారు మాత్రం తగ్గించుకుని ఫిట్ గా మారాలని కోరుకుంటారు. ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన విశ్లేషణ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు, పెద్దలు ఊబకాయం బాధితులుగా ఉన్నారనేది వాస్తవం. ఈ క్రమంలోనే ఓ మహిళ ఏకంగా 10 నెలల్లో 44 కిలోల బరువు తగ్గి అందరినీ అబ్బురపరిచింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు, వివరాలను తెలుసుకుందాం.

ఇంగ్లండ్‌లోని తూర్పు ససెక్స్‌లో నివసిస్తున్న మేరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె చిన్నతనం నుంచే స్థూలకాయానికి గురయ్యి ఇబ్బంది పడేవారు. అయితే ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆమె ఈ లోపాన్ని అనుభవించింది. నిజానికి ఏం జరిగిందంటే ఆమె ఊబకాయం కారణంగా బిడ్డను ఏడవ నెలలోనే జన్మనిచ్చింది.

మీడియా సమావేశంలో మేరీ మాట్లాడుతూ ఈ డెలివరీ తర్వాత మాత్రమే తాను తన బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ ప్రయాణంలో మేరీ రోజుకు ఒక సారి భోజనం తినడం ప్రారంభించారని తెలిపారు. ఆకలి వేసినప్పుడు కాస్త చిరాకుగా ఉన్నా కొన్నిసార్లు తాను ప్రణాళికల పై దృష్టి పెట్టలేకపోయారని, కానీ దీని తర్వాత తాను స్లిమ్మింగ్ వరల్డ్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.

మొదట్లో ఇదేదో అనుకున్నా కానీ అక్కడి డైటీషియన్ బరువు తగ్గడానికి ఇలాంటి మార్గాలు చెప్పారు. అది తన జీవితాన్ని మార్చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అక్కడ ఆహారం, పానీయాల పై ఎటువంటి ఆంక్షలు లేవు. అయినప్పటికీ, తాను 44 కిలోల బరువు కోల్పోయానని ఆ తర్వాత తాను తన రెండవ బిడ్డకు జన్మనిచ్చినా తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నదని చెబుతున్నారు.

Tags:    

Similar News