అలా రోడ్డు దాటిన వృద్ధుల జంట.. ప్రేమంటే ఇదేరా..! (వీడియో)
సుదీర్ఘ కాలం పెనవేసుకున్న ప్రేమ చాలా అరుదుగానే కనిపిస్తుంది. an elderly couple crossing the road together with eternal love.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రేమకు పాతదనం ఉండదు. నిత్యం తాజాగా కనిపించే అపురూప దృశ్యం ప్రేమ. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు మాత్రంగానే కనిపిస్తూ, ఎలాంటి బంధాలనైనా డబ్బులు, పరపతులతోనే నిర్మించుకుంటున్న ఈ రోజుల్లో సుదీర్ఘ కాలం పెనవేసుకున్న ప్రేమ చాలా అరుదుగానే కనిపిస్తుంది. చిటికేసినంత సులువుగా వివాహ బంధం వీగిపోతున్న ఈ కాలంలో కాటికి కాలు చాచినా ప్రేమలో చేయి విడవని జంట కనిపిస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుంది. అలాంటి ప్రేమను ఈ వృద్ధ జంట కలిసి రోడ్డు దాటుతున్న ఈ వీడియో కంటే స్పష్టంగా ఇంకేం వర్ణించగలదు! ఓ వర్షం కురుస్తున్న రోజున ఒక వృద్ధ జంట కలిసి నడుస్తున్న ఈ వీడియో ఇంటర్నెట్‌ను కరిగిపోయేలా చేసింది.
ఈ వీడియోను ఫోటోగ్రాఫర్, డిజిటల్ కంటెంట్ సృష్టికర్త ఆసిఫ్ ఖాన్ క్యాప్చర్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. హృదయాన్ని స్పృశించే ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూవ్స్.. లైకులు, కామెంట్లతో నెటిజనులు మురుసుకుంటున్నారు. అందులోనూ, వృద్ధుడు తన భార్య కోసం గొడుగు పట్టుకొని ఉంటే, ఆమె ఒక బ్యాగ్ పట్టుకుని నడుస్తూ కనిపిస్తారు. "ఏదీ లేని ప్రపంచంలో శాశ్వతమైన ప్రేమ ఆలోచన మాత్రమే ఉండటం మంత్రముగ్దులను చేస్తుంది కదా" అని ఈ వీడియో శీర్షిక అందర్నీ ఆకర్షించింది.