చనిపోయిన ఆత్మలు వెళ్లే గుడి.. దీని రహస్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎక్కడైనా దేవాలయాల్లో దేవుళ్లు ఉంటారు. అక్కడకి ప్రజలందరూ పోయి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. కానీ హిమాచల్ ప్రదేశ్‌లోబర్మోర్ పట్టణంలో చౌరాసి దేవాలయాల సముదాయం ఉంది.

Update: 2023-04-06 09:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎక్కడైనా దేవాలయాల్లో దేవుళ్లు ఉంటారు. అక్కడకి ప్రజలందరూ పోయి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. కానీ హిమాచల్ ప్రదేశ్‌లోబర్మోర్ పట్టణంలో చౌరాసి దేవాలయాల సముదాయం ఉంది. అందులో ఒక దేవాలయమే ధర్మేశ్వర్ మహాదేవ దేవాలయం. అయితే చూడటానికి ఓ ఇళ్లులా ఉండే ఈ దేవాలయకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇంట్లో చిత్రగుప్తుడు, యమధర్మరాజు ఉంటారంట. అంతే కాకుండా, చనిపోయిన వారి ఆత్మలు కూడా ఆ దేవాలయంలోకి వస్తాయంట.

అక్కడ దేవాలయంలో రెండు ఖాళీ గదులు ఉంటాయి. మొదటి గదిలో చిత్రగుప్తుడు ఉంటారని చెబుతారు.రెండో గదిలో యమదర్మరాజు ఉంటారు. చనిపోయినవారికి వారు శిక్షలు వేస్తారంట.ఆత్మను యమభటులు ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత సదరు జీవి చేసిన పాపపుణ్యాలను విడమరిచి చెబుతాడు. అటుపై ఆత్మ రెండో గదిలోకి వెలుతుంది. అక్కడ సదరు పాపపుణ్యాలను అనుసరించి అక్కడ శిక్ష ఖరారు అవుతుంది. శిక్ష ఖారారైన తర్వాత యమలోకానికి వెళ్లి అక్కడ సదరు శిక్ష అనుభవిస్తుంది. ప్రతి జీవి ప్రాణం పోయిన తర్వాత ఆత్మ మొదట ఈ దేవాలయానికి తప్పక వస్తుందని ఇక్కడి నమ్మకం. ఈ విషయాన్ని గరుడ పురాణంతోపాటు మరికొన్ని పురాణాల్లోనూ ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి: బయటపడ్డ 11వ శతాబ్దపు చర్చి.. కరువుతో జనం విలవిల

Tags:    

Similar News