నేర్చుకోవడంలో సమస్యలా?.. ఇష్టమైన వాళ్లు చెప్తే మెదడు ఈజీగా గ్రహిస్తుందట !

Update: 2024-02-20 09:22 GMT

దిశ, ఫీచర్స్ :  మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఎంత ట్రై చేసినా రావడం లేదనిపిస్తోందా? అయితే మీకు ఇష్టమైన వ్యక్తుల ద్వారా, వారిచ్చే సమాచారం ఆధారంగా ఆ ప్రయత్నం చేయండి. అప్పుడు తప్పక సక్సెస్ అవుతారు! ఎందుకంటే.. మీరు నిజంగా ఇష్టపడే లేదా ఆరాధించే వ్యక్తి ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ లెర్నింగ్ విషయంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని స్వీడన్‌లోని న్యూరో సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. ఇష్టమైన వాళ్లు చెప్పినప్పుడు, వారి ద్వారా జ్ఞానాన్ని పొందినప్పుడు మానవ మెదడులో ‘పాజిటివ్ ప్రోగ్రామింగ్’ ఏర్పడిందని, అలాగే నచ్చని వ్యక్తుల ద్వారా వచ్చే సమాచారం మెదడులో ‘నెగెటివ్ ప్రోగ్రామింగ్’ను క్రియేట్ చేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

తన హార్డ్‌వేర్‌ను మెరుగ్గా రక్షించుకోవడానికి అప్‌డేట్స్ అవసరమయ్యే కంప్యూటర్ లాగా, మానవ మెదడు కొత్త అనుభవాల నుంచి నేర్చుకోవడానికి, ఇప్పటికే ఉన్నటువంటి దాని లైబ్రరీ ఆఫ్ నాలెడ్జ్‌ను మెరుగుపరచడానికి మెమోరీని ఉపయోగిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రపంచం గురించి కొత్త అనుభవాన్ని, అవగాహనను రూపొందించడంలో సహాయపడుతుంది. వ్యక్తులకు ప్రత్యక్ష అనుభవం లేని పరిస్థితుల గురించి కూడా అంచనా వేయడానికి దోహదపడుతుంది. అయితే ఇక్కడ ఇష్టమైన వ్యక్తిని మైండ్ వెంటనే అడాప్టివ్ లేదా యాక్సెప్ట్ చేసుకుంటుందని, ఇష్టం లేని వ్యక్తుల విషయంలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఇనేస్ ​బ్రామోవో అంటున్నారు.

అధ్యయనంలో భాగంగా నిపుణులు బౌల్, బాల్, స్పూన్, కత్తెర లేదా రోజువారీ జీవితంలో కనిపించే ఇతర వస్తువులు వంటి విభిన్న వస్తువులను గుర్తుంచుకునే విషయమై పలువురిని పరిశీలించారు. అదనంగా పార్టిసిపెంట్స్ రాజకీయ అభిప్రాయాలు, ఆహారపు అలవాట్లు, అభిరుచులు, ఇష్టమైన క్రీడలు, ఇతర ప్రాధాన్యతల ఆధారంగా వారు ఇష్టపడేవి, ఇష్టపడని వాటిని నిర్వచించారు. ఈ సందర్భంగా పరిశోధకులు పార్టిసిపెంట్స్ తాము ఇష్టపడే వ్యక్తి చెప్పినప్పుడు కొత్త విషయాలను, ఇతర సమాచారాన్ని గుర్తుంచుకోవడం వంటివి ఎఫెక్టివ్‌గా చేయగలిగారని, అలాగే నచ్చని వ్యక్తులు చెప్పినప్పుడు ఆ సమాచారాన్ని వారు గుర్తుంచుకోవడం లేదని, మెదడు కూడా సరిగ్గా గ్రహించడం లేదని తెలుసుకున్నారు. ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడంలో ఈ ఫలితాలు ముఖ్యమైనవని పరిశోధకులు అంటున్నారు.


Similar News