బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తున్న రిబోసిక్లిబ్ డ్రగ్.. అధ్యయనంలో వెల్లడి

రొమ్ము క్యాన్సర్ ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టం. ట్రీట్మెంట్, మెడికేషన్స్ ద్వారా తగ్గినప్పటికీ తిరిగి పునరావృతం అవుతూ ఉంటుంది.

Update: 2023-06-04 05:36 GMT

దిశ, ఫీచర్స్: రొమ్ము క్యాన్సర్ ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టం. ట్రీట్మెంట్, మెడికేషన్స్ ద్వారా తగ్గినప్పటికీ తిరిగి పునరావృతం అవుతూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 మిలియన్ల మంది మహిళలు ఈ విధమైన సమస్యతో బాధపడుతున్నారు. అయితే హార్మోనల్ థెరపీలో యూజ్ చేసే రిబోసిక్లిబ్ అనే డ్రగ్ వల్ల ఇది పునరావృతం అయ్యే అవకాశం 25 శాతం తగ్గుతుందని అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ ((ASCO) అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధనలో భాగంగా నిపుణులు 5, 101 మంది రోగులకు మూడేళ్లపాటు హార్మోన్ల చికిత్సతో కలిసి ఈ డ్రగ్‌ను అందించడం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోగలిగారు. బ్రెస్ట్ క్యాన్సర్ కణాలలో నిర్దిష్ట ప్రోటీన్లు, CDK4 అండ్ CDK6లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ribociclib సమర్థవంతంగా పనిచేస్తుందని, క్యాన్సర్ సెల్స్ గ్రోత్‌ను నియంత్రిస్తుందని పరిశోధకులు తెలిపారు. భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించేందుకు ఇది దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

వరండాలో కూర్చొని స్మోక్ చేస్తే .. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందా?  

Tags:    

Similar News