టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్‌కు చెక్.. అధ్యయనంలో వెల్లడి
టీబీ లేదా క్షయవ్యాధిని నిరోధించే బాసిల్లస్ కాల్మెట్-గ్వెరిన్ (BCG) వ్యాక్సిన్ అల్జీమర్స్ వ్యాధిని, సంబంధిత మతిస్థిమితం వంటి రుగ్మతలను తగ్గించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది.
దిశ, ఫీచర్స్ : టీబీ లేదా క్షయవ్యాధిని నిరోధించే బాసిల్లస్ కాల్మెట్-గ్వెరిన్ (BCG) వ్యాక్సిన్ అల్జీమర్స్ వ్యాధిని, సంబంధిత మతిస్థిమితం వంటి రుగ్మతలను తగ్గించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. పైగా బీసీజీతో కూడిన చికిత్స 25 శాతం తక్కువ డెత్ రిస్క్ కలిగి ఉంటుందని, ఇది మల్టిపుల్ బెనిఫిషియల్ రోల్ పోషిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ మల్టిపుల్ బెనిఫిషియల్ ప్రభావాన్ని కలి ఉందని, కండరాల-ఇన్వాసివ్ బ్లాడర్ క్యాన్సర్(muscle-invasive bladder cancer) చికిత్సకు సిఫార్సు చేయబడుతోందని పేర్కొన్నారు.
బీసీజీ వ్యాక్సిన్ అల్జీమర్స్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ (MGH), బ్రిఘం అండ్ ఉమెన్స్ హాస్పిటల్ (BWH) నిపుణులతో కూడిన యూఎస్‌లోని పరిశోధకుల బృందం విస్తృత పరిశోధనలు నిర్వహించింది. ఇందులో భాగంగా కండరాల ఇన్వాసివ్(invasive) బ్లాడర్ క్యాన్సర్ నిర్ధారణ అయిన 6,467 మంది వ్యక్తులను 15 ఏళ్ల పాటు అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా బీసీజీ టీకా ట్రీట్మెంట్ పొందిన 3,388 మంది రోగుల్లో 3,079 మందిలో అల్జీమర్స్ తగ్గుతున్నట్లు గుర్తించారు. మరికొన్ని అధ్యయనాల్లో కూడా బీసీజీ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించబడితే, భవిష్యత్తులో అల్జీమర్స్‌కు చాలా తక్కువ ఖర్చుతో కూడున్న మెరుగైన ట్రీట్మెంట్ అందించవచ్చని పరిశోధకుడు వీన్ బర్గ్ అన్నారు.
Read More: ధనియాలు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే!