లైఫ్ క్వాలిటీని పెంచుతున్న గుడ్ స్లీప్.. అధ్యయనంలో వెల్లడి

గుడ్ స్లీప్ లేదా మనశ్శాంతిగా కంటినిండా నిద్రపోవడం వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ జీవన నాణ్యతను పెంచుతుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.

Update: 2023-06-07 09:18 GMT

దిశ, ఫీచర్స్ : గుడ్ స్లీప్ లేదా మనశ్శాంతిగా కంటినిండా నిద్రపోవడం వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ జీవన నాణ్యతను పెంచుతుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇందులో భాగంగా నిపుణులు 8 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలతోపాటు 18 నుంచి 96 సంవత్సరాల వయస్సుగల పెద్దలను కూడా పరిశీలించారు. వారం రోజులపాటు రాత్రిపూట నిద్రలో 39 నిమిషాల తగ్గింపు కూడా బాధితుల లైఫ్ క్వాలిటీపై ఎఫెక్ట్ చూపుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లోని డునెడిన్‌కు(Dunedin) చెందిన 100 మంది పిల్లలలో ఆహారపు అలవాట్లు, కార్యాచరణ విధానాలు, సామాజిక సంబంధాలపై చిన్నపాటి నిద్రలేమి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒటాగో యూనివర్సిటీలో మెడిసిన్ డిపార్టుమెంట్ హెడ్ అయిన ప్రొఫెసర్ రాచెల్ టేలర్ (Rachael Taylor) ఆధ్వర్యంలో ఈ అధ్యయనం కొనసాగింది.

4,250 మందిపై పరిశోధన

పరిశోధనలో భాగంగా నిపుణులు పిల్లల్లో వారానికి ఒక గంట ఆలస్యంగా, అలాగే మరో వారంపాటు ఒక గంట ముందుగా నిద్రవేళను సర్దుబాటు చేయడం ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఇందులో సోషల్ సపోర్ట్, తోటివారి సంబంధాలకు సంబంధించిన అదనపు సవాళ్లను కూడా పిల్లలు ఎదుర్కొన్నట్లు గమనించారు. అదేవిధంగా 2018 నుంచి 2020 వరకు చెక్ హౌస్‌హోల్డ్(Czech Household) ప్యానెల్ నిర్వహించిన సర్వేను, 18 నుంచి 96 మధ్య వయస్సు గల 4,250 మంది పెద్దలపై కొనసాగిన అధ్యయనాన్ని కూడా నిపుణులు విశ్లేషించారు. దీంతో పూర్‌స్లీప్ క్వాలిటీ కలిగి ఉన్నవారు జీవితంలో తక్కువ ఆనందంగా, తక్కువ సంతృప్తిగా ఉంటారని, అదే విధంగా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటారని నిపుణులు కనుగొన్నారు.

మెలటోనిన్ ప్రభావం

ఎక్కువసేపు మనశ్వాంతిగా నిద్రపోవడం లేదా నాణ్యమైన నిద్ర జీవన ప్రమాణాన్ని పెంచడంతోపాటు అనారోగ్యాలను దూరం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇక నిద్రలేమి, దానిమూలంగా యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వైద్య నిపుణులను సంప్రదించడంవల్ల పొందే మెలటోనిన్ ప్రిస్ర్కిప్షన్ ద్వారా, నాణ్యమైన నిద్రను పెంచే శారీరక శ్రమ, మోడరేట్ ఎక్సర్‌సైజ్‌లు, జీవన శైలి మార్పుల ద్వారా ప్రయోజనం పొందవచ్చని కరోలిన్‌స్కా(Karolinska)ఇన్ స్టిట్యూట్‌కు చెందిన సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్‌తో నిద్ర నాణ్యత పెరగడంవల్ల ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుందని చైనాలోని గ్వాంగ్‌జౌ మెడికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు డాక్టర్ జిహుయ్ జాంగ్ వెల్లడించాడు.

Also Read..

నిద్రించే సమయంలో తల ఆ దిక్కుకే ఎందుకు పెట్టాలో తెలుసా..? 

Tags:    

Similar News