డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి హానికరం !.. ‘కన్జ్యూమర్ రిపోర్ట్’ అధ్యయనంలో వెల్లడి
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది తినడానికి ఇష్టపడుతుంటారు
దిశ, ఫీచర్స్: డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది తినడానికి ఇష్టపడుతుంటారు. యాంటీ ఆక్సిడెంట్ల మూలం పుష్కలంగా ఉంటుందని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదని ‘కన్జ్యూమర్ రిపోర్ట్’ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ బ్రాండ్ హెర్షే రీసెంట్‌గా తమ డార్క్ చాక్లెట్ బార్‌లలో లెడ్ (సీసం). కాడ్మియం (cadmium) వంటి ప్రమాదకర మెటల్ స్థాయిలను కలిగి ఉన్నట్లు పేర్కొనడంతో ఇది చర్చనీయాంశం అవుతోంది.
ఇప్పటి వరకు, ఇతర రకాల చాక్లెట్‌లతో పోల్చినప్పుడు డార్క్ చాక్లెట్ ఆరోగ్యకరమైందని గత అధ్యయనాలు రుజువు చేశాయి. 2015 లో కేథరీన్ పి. ద్వారా నిర్వహించ బడిన అధ్యయనం, అలాగే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన పీర్-రివ్యూడ్ జర్నల్ న్యూట్రిషన్ రివ్యూస్ ప్రకారం కూడాను డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్‌లు(flavonoids) మానవ ధమనులకు (arteries) విశ్రాంతినిచ్చే సిగ్నల్స్‌ను పంపుతాయని, అందువల్ల అవి రక్తపోటును తగ్గిస్తాయని పేర్కొన్నాయి. కానీ తాజాగా అందుకు భిన్నమైన అంశాలు వెలుగు చూశాయి. వివిధ బ్రాండ్‌లకు చెందిన 28 రకాల డార్క్ చాక్లెట్ బార్‌లలో నిపుణులు తనిఖీ చేశారు. 28 డార్క్ చాక్లెట్లను పరిశీలించగా ఆర్సెనిక్, కాడ్మియం, సీసం, పాదరసం స్థాయిలు వాటిలో హానికలిగించే రీతిలో ఉన్నాయని తేలింది. ఆ తర్వాత అన్నింటిలోనూ ఈ ప్రమాదకర లోహాలు ఉంటున్నాయని గ్రహించారు.
ఎలా హానికరం?
డార్క్ చాక్లెట్ల తయారీలో కాడ్మియం, సీసం, పాదరసం వంటి అధిక స్థాయిల వినియోగం ఆరోగ్యానికి హానికరమని కన్జ్యూమర్ రిపోర్టు సంస్థ నిపుణులు పేర్కొన్నారు. వీటిని తినడంవల్ల గర్భిణుల్లో పిండం ఎదుగుదల సమస్యలు తలెత్తుతాయని, అలాగే చిన్ని పిల్లల్లో మెదడు ఎదుగుదల లోపిస్తుందని, లో IQకి కారణమవుతుందని సైంటిస్టులు, ఆహార నిపుణులు నిర్ధారించారు. ఎకోటాక్సికాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సేఫ్టీ జర్నల్ ప్రకారం.. కాడ్మియం లెవల్స్ అధికంగా ఉంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఏం చేయాలి?
డార్క్ చాక్లెట్లతోపాటు ప్రాసెస్ చేయబడిన ఇతర చాక్లెట్లైనా, ఆహారాలైనా, జంక్ ఫుడ్స్ అయినా ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వాటిని తినడం మానుకోవాలని సూచిస్తున్నారు. పూర్తిగా మానుకోలేనివారి కనీసం వాటిని పరిమితం చేయడం మంచిదని సూచిస్తున్నారు. వాటికి బదులు ప్రత్యామ్నాయ ఆహారాలు ఉన్నాయి. ఉదాహరణకు స్వీట్ తినాలనిపిస్తే ఖర్జూరం, తేనె వంటివి యూజ్ చేయవచ్చు. మెగ్నీషియం కోసం తృణ ధాన్యాలను యూజ్ చేయవచ్చు. తమ ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు తప్పక ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌ను నివారించగలుగుతారని నిపుణులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి: