భారతీయ దివ్యాంగుల కోసం 'కృత్రిమ కాలు'.. ఫ్లెక్సిబుల్ డిజైన్
దిశ, ఫీచర్స్ : దివ్యాంగుల కోసం రూపొందించిన కృత్రిమ కాళ్లు అందరికీ అందుబాటులో ఉండవు. ఒకవేళ ఉన్నా భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాలకు అవి సరిపోకపోవచ్చు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : దివ్యాంగుల కోసం రూపొందించిన కృత్రిమ కాళ్లు అందరికీ అందుబాటులో ఉండవు. ఒకవేళ ఉన్నా భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాలకు అవి సరిపోకపోవచ్చు. పైగా ఖరీదు కూడా ఎక్కువే కావచ్చు. ఈ ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న IIT గౌహతి పరిశోధకులు ఓ కృత్రిమ కాలును డిజైన్ చేశారు. ఆ వివరాలు మీకోసం
విద్యా మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ విభాగం సమకూర్చిన నిధులతో IIT గౌహతి శాస్త్రవేత్తలు దివ్యాంగులపై చాలా ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఎక్కువ సమయం వారితోనే గడుపుతూ వారి ప్రత్యేక అవసరాలను అంచనా వేశారు. ఆ అధ్యయన ఫలితాల ఆధారంగానే కృత్రిమ కాలును రూపొందించగా.. ప్రస్తుతం పేషెంట్ ట్రయల్స్‌లో ఉన్న ఈ డిజైన్‌ను ఏడాదిలోపు మార్కెట్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.
క్రాస్ సిట్టింగ్ :
'వెస్ట్రన్-స్టై్ల్' ప్రొస్థెటిక్ లెగ్ వల్ల 'స్క్వాట్' టాయిలెట్‌ను ఉపయోగించలేరు. 'కుర్చీ పొజిషన్'లో లేదా 90° కోణంలో మాత్రమే కూర్చునే వీలుంటుంది. మరింత కిందకు కూర్చునేందుకు ప్రయత్నిస్తే లాక్ అవుతుంది. ఇక క్రాస్-లెగ్డ్ సిట్టింగ్, యోగాలోని వ్యాయామ భంగిమలకు కూడా ఇవి సరిపోవు. కాగా ఈ సమస్యలకు పరిష్కారంగానే గౌహతి సైంటిస్ట్‌లు 'డీప్ స్క్వాట్ మెకానిజం' సహా 'మోకాలి రొటేషన్ మెకానిజం'ను ఉపయోగించి ప్రొస్థెటిక్ లెగ్ తయారుచేశారు.
యాంకిల్ (చీలమండ) :
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మెకానికల్ ఫుట్, రబ్బర్ ఫుట్ లేదా జైపూర్ ఫుట్.. కొంచెం వంగడానికి మించి ఎటువంటి కదలికను అనుమతించవు. IIT-G రూపొందించిన కాలులో జాయింట్ కొంచెం సరళంగా ఉండటమే కాకుండా ఒక స్థాయి కదలికను అనుమతిస్తుంది. అంతేకాదు వివిధ భూభాగాలకు తగిన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది.
యూనివర్సల్ నీడ్స్ :
ప్రొస్థెటిక్ లెగ్ విషయంలోనూ అవసరాలు మారుతుంటాయి. ఉదాహరణకు కాలు కోల్పోయిన ప్రారంభ దశల్లో పడిపోతామన్న భయాన్ని పరిష్కరించేందుకు ప్రోస్థెసిస్‌ను ఉపయోగిస్తారు. అదే సదరు వ్యక్తి పరికరానికి అలవాటుపడిన తర్వాత మెట్ల మీద నడిచేందుకు, విచ్ఛేదనం(amputation) తర్వాత మిగిలి ఉన్న రోగి కాలు పొడవుపై ఆధారపడి కూడా ప్రొస్థెసిస్ అవసరాలు మారుతూ ఉంటాయి. ఈ కారణాలతో కొత్త కృత్రిమ కాలు నీ-లాకింగ్ మెకానిజంను కలిగి ఉంది. ఇది వివిధ పరిస్థితులపై ఆధారపడి యాక్టివేట్, డీయాక్టివేట్ అవుతుంది. ఇది లింక్ లెంగ్త్‌ను సర్దుబాటు చేసుకునే మెకానిజాన్ని కలిగి ఉంటుంది.
ఏళ్ల కష్టానికి ఫలితం
పరికరంలోని వివిధ భాగాల కోసం పాలిమర్స్, అల్యూమినియం మిశ్రమాలతో పాటు స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగించారు. దీని ధర రూ. 25,000/-
మా బృందం చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది. అనేక మంది రోగులతో మాట్లాడి వారి అవసరాలు అర్థంచేసుకున్నాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ కాళ్ల లోపాలను అర్థం చేసుకున్నాం. ఎప్పటికప్పుడు డిజైన్‌ను మెరుగుపరిచాం. ఇప్పటికే చాలా మంది దివ్యాంగులకు ఈ పరికరాన్ని అందించాం. ఇంకా సాధ్యమైన మెరుగుదల కోసం మా బృందం అభిప్రాయాలు సేకరిస్తోంది. కొన్ని పరిశ్రమలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఏడాది లోపు ఇది వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుంది.
- ఎస్ కనగరాజ్ , IIT-Gలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, పరిశోధకు