ఆ వ్యక్తికి 9 నెలల్లో 217 కోవిడ్-19 వ్యాక్సిన్లు... చివరికి ఏం అయ్యిందంటే..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు దానికి నివారణ దొరుకుతుందని ప్రజలు అస్సలు ఊహించలేదు.

Update: 2024-03-10 11:53 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు దానికి నివారణ దొరుకుతుందని ప్రజలు అస్సలు ఊహించలేదు. అయితే శాస్త్రవేత్తలు ఆ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. సాధారణంగా ఈ వ్యాక్సిన్ ను ప్రజలకు రెండు డోస్‌లు మాత్రమే ఇచ్చారు. అయితే కొంతమందికి మూడు డోస్‌లు కూడా ఇచ్చారు. ఇంకొంతమంది రెండు డోస్ లు సరిపోలేదు అన్నట్టు 10-15 డోస్‌లు తీసుకున్న సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి ఒక అంశమే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని విన్న సమాన్య ప్రజలు మాత్రమే కాదు శాస్త్రవేత్తలను సైతం దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జర్మన్ శాస్త్రవేత్తల బృందం 62 ఏళ్ల ఓ వ్యక్తిని అధ్యయనం చేసింది. అతను ఉద్దేశపూర్వకంగానే 29 నెలల్లో 217 కోవిడ్-19 వ్యాక్సిన్ షాట్‌లను తీసుకున్నాడని ఈ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇంత మోతాదులో అతను వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ అతనికి ఎటువంటి దుష్ప్రభావాలు లేవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతను పూర్తిగా సురక్షితంగా ఉన్నాడని వెల్లడించారు. జర్మనీలోని మాగ్డెబర్గ్‌కు చెందిన ఈ వ్యక్తి గురించి ఒక వార్తాపత్రిక ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకున్నప్పుడు, వారు అతనిని సంప్రదించారని తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ ఎర్లాంజెన్ - నూరేమ్‌బెర్గ్ పరిశోధకులు అతనిని అధ్యయనం చేసేందుకు అడగడంలో అతను అంగీకరించాడట.

ఎటువంటి దుష్ప్రభావాలు లేవు..

ఓ వెబ్‌సైట్ నివేదికల ప్రకారం శాస్త్రవేత్తల బృందం ఇటీవల లాన్సెట్ జర్నల్‌లో అనేక ఆసక్తికరమైన ఫలితాలను ప్రచురించింది. డాక్టర్ కిలియన్ షౌబెర్ మాట్లాడుతూ 'అసాధారణమైన హైపర్‌వాక్సినేషన్ తీసుకున్నప్పటికీ వ్యక్తిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించారు.

2 సంవత్సరాల క్రితం చర్చలోకి వచ్చిన వ్యక్తి..

ఆసక్తికరంగా ఈ వ్యక్తి మొదటిసారిగా 2022 సంవత్సరంలో వెలుగులోకి వచ్చాడు. అతను కోవిడ్-19కి వ్యతిరేకంగా కనీసం 90 సార్లు టీకాలు వేసినట్లు వెల్లడైంది. వ్యాక్సినేషన్ ను నిర్వహిస్తున్న అధికారులు ప్రమాదవశాత్తూ ఒక వ్యక్తికి ఇన్ని మోతాదుల వ్యాక్సిన్‌ను వేసినట్లు అనుమానించినప్పటికీ, ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే ఇన్ని మోతాదుల వ్యాక్సిన్‌ను తానే వేయించుకున్నట్లు వెల్లడించాడు.

Tags:    

Similar News