పెంగ్విన్‌కు అనారోగ్యం.. ఎంఆర్ఐ స్కాన్ తీసిన డాక్టర్లు !
అనారోగ్యాల బారిన పడినప్పుడు అందుకు కారణాన్ని నిర్ధారించేందుకు నిర్వహంచే టెస్టుల్లో ఎంఆర్ఐ స్కాన్ ఒకటి.
దిశ, ఫీచర్స్: అనారోగ్యాల బారిన పడినప్పుడు అందుకు కారణాన్ని నిర్ధారించేందుకు నిర్వహంచే టెస్టుల్లో ఎంఆర్ఐ స్కాన్ ఒకటి. సాధారణంగా మనుషులే ఇటువంటి పరీక్షలు చేయించుకుంటారు. కానీ ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా యూకేలో ఒక పెంగ్విన్‌కు కూడా చేశారు. ఇక్కడి వేమౌత్‌లోని సీ లైఫ్ అడ్వెంచర్ పార్కులో నివసించే ‘చకా’ అనే పేరుగల పెంగ్విన్ కొంతకాలంగా వణకడం, నడవడంలో తడబాటు వంటి వ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటోంది. దీంతో సొమర్‌సెట్(Somerset)లోని కేవ్ వెటర్నరీ నిపుణులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సదరు పెంగ్విన్ ‘వబ్లింగ్‌లో వడ్లింగ్’ (wobbling’ while waddling) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే వెటర్నరీ మెడికేషన్ రంగంలో ఇదొక గొప్ప మైలురాయిగా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ‘చకా’(Chaka)తోటి పెంగ్విన్‌లతో సంభాషిస్తూ హెల్తీ సోషల్ లైఫ్ గడుపుతోందని వే మౌత్ సీ లైఫ్ అడ్వెంచర్ పార్క్ నిర్వాహకులు తెలిపారు. దానిని జాగ్రత్తగా చూసుకునేలా, అదనపు సౌకర్యాలు కల్పించేలా వెటర్నరీ నిపుణుల బృందం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.