అమ్మే సర్వస్వం.. ప్రపంచంలోనే బెస్ట్ మదర్స్‌గా ఫీలవుతున్న 73 శాతం మంది తల్లులు
అమ్మంటే.. అనిర్వచనీయ ఆనందం. అమ్మంటే కళ్లముందు కదలాడుతున్న ప్రత్యక్ష దైవం.
దిశ, ఫీచర్స్ : అమ్మంటే.. అనిర్వచనీయ ఆనందం. అమ్మంటే కళ్లముందు కదలాడుతున్న ప్రత్యక్ష దైవం. అందుకే ప్రతి ఒక్కరికీ అమ్మే మొదటి రోల్ మోడల్, అమ్మే అత్యంత నమ్మకమైన సంరక్షకురాలు. పిల్లలను ప్రేమించడంలో, లాలించడంలో అమ్మను మించినవారు ఇంకెవరూ ఉండరు. ప్రతీ విషయంలో, ప్రతీ సందర్భంలో బిడ్డల క్షేమం గురించి ఆలోచిస్తూ ఆరాటపడే గొప్ప వ్యక్తి అమ్మ. తన పిల్లలకు తానే సర్వస్వమని భావిస్తుంది అమ్మ. తల్లీ పిల్లల మధ్య ఉండే సెంటిమెంట్ ఎంత గొప్పదో, ఎంత మధురమైందో పరిశీలించడానికి యూఎస్ ఆధారిత సంస్థ వన్‌పోల్ ఇటీవల 2000 మంది తల్లులపై ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. 73 శాతం మంది తల్లులు ప్రపంచంలో అందరికంటే తామే బెస్ట్ మదర్ అని భావిస్తున్నారట. ఇక ప్రతీ 10 మంది తల్లులలో 8 మంది తమ కుటుంబానికి తామే చోదక శక్తి అని, తాములేకుండా కుటుంబం నడవదని నమ్ముతున్నారు. వీరిలో సూపర్ హీరో లక్షణాలను ప్రశ్నించినప్పుడు ప్రాబ్లం-సాల్వింగ్‌లో 52 శాతం, పోషణలో 50 శాతం, మల్టీ టాస్కింగ్‌లో 41 శాతం, టైమ్ అండ్ ఆర్గనైజేషన్ మేనేజ్ మెంట్‌లో 36 శాతం, కమ్యూనికేషన్‌లో 34 శాతం తల్లులు తమ నైపుణ్యాలపై అత్యంత నమ్మకంగా ఉంటున్నారు. ఇక 83 శాతం మంది తల్లులు తమ పిల్లలను పెంచి పోషించడంలో సపోర్ట్ అండ్ అడ్వైస్ కోసం ఇతర తల్లులను కూడా అబ్జర్వ్ చేస్తారట. ఇతర తల్లులు తమ కష్టాలను, అనుభవాలను పంచుకోవడం చూసినప్పుడు 77 శాతం మంది తల్లులు తాము పడే ఇబ్బందులను మరచిపోయి శక్తివంతంగా తయారవుతున్నట్లు సర్వే పేర్కొన్నది.
Read More... మహిళల్లోనే ఆ రిస్క్ ఎక్కువ.. కార్పొరేట్ సెక్టార్ ఉద్యోగులపై సర్వేలో వెల్లడి