బెడ్ టైమ్ హాబిట్స్.. టాయ్స్ ఉంటేనే నిద్రపోతున్న 40% మంది
మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?
దిశ, ఫీచర్స్: మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అయితే మీ భాగస్వామికి ఇష్టమైన స్టఫుడ్ యానిమల్‌ను కూడా మీ బెడ్ రూమ్‌లో ఉంచేందుకు సిద్ధం చేసుకోండి. ఎందుకంటే.. ఒక కొత్త డేటా ప్రకారం అమెరికన్లతో సహా ప్రపంచ వ్యాప్తంగా 52 శాతం మంది సెక్యూరిటీ బ్లాన్కెట్ లేదా స్టఫ్డ్ యానిమల్‌తో కలిసి నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు. 77 శాతం మంది తమ పార్టనర్‌తో కలిసి పడుకుంటున్నప్పటికీ బెడ్‌పై పెద్దగా ఉండే మెత్తటి టాయ్‌ని పక్కన ఉంచుకుంటున్నారని, నిద్రవేళలో దానిని పట్టుకోవడం, దానిపై చేతులు లేదా కాళ్లు వేసి పడుకోవడం చేస్తున్నారని భాగస్వామితో కలిసి జీవించే 2,000 మంది అడల్ట్స్‌పై వన్‌పోల్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
నిపుణులు సర్వేలో భాగంగా కపుల్స్ లేదా సహజీవనంలో ఉన్నవారి బెడ్ టైమ్ హాబిట్స్ గురించి ఎక్కువగా స్టడీ చేశారు. కో స్లీపింగ్‌లో ఉన్నప్పుడు 35 శాతం మంది తాము కప్పుకున్న దుప్పటిని భాగస్వామి లాగినప్పుడు మేల్కోవడం, అటు తిరిగి పడుకోవడం వంటి అలవాట్లను కలిగి ఉంటున్నారు. టీవీ చూస్తూ నిద్రలోకి జారుకొని ఆఫ్ చేయడం మర్చిపోయేవారు 28 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక గురక పెట్టేవారు 28 శాతం మంది, లైట్లు ఆన్‌లో ఉండగానే నిద్రపోయేవారు 27 శాతం మంది ఉంటున్నారు. మూడింటి రెండు వంతుల మంది(64%) పడుకునే ముందు తలస్నానం చేస్తున్నారట. 58 శాతం మంది తమ పార్టనర్ స్నానం చేయకపోతే ఇబ్బంది పడతామని పేర్కొన్నట్లు సర్వే వెల్లడించింది. నాణ్యమైన నిద్రకోసం సహాయపడే విషయాల గురించి అడిగినప్పుడు కొత్త లేదా క్వాలిటీ బెడ్ ఉపయోగపడుతుందని 36 శాతం మంది, మెరుగైన దిండ్లు అవసరమని 34 శాతం మంది, పెద్ద మంచం అయితే బాగుంటుదని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆశ్చర్యకరకమైన విషయం ఏంటంటే.. కో స్లపీపింగ్ కపుల్స్‌లలో 49 శాతం మంది తాము నాణ్యమైన నిద్ర, విశ్రాంతి కోసం పార్టనర్‌తో కాసేపు గడిపాక విడిగా సపరేట్ బెడ్‌లో పడుకోవడానికి ఇష్టపడుతున్నట్లు వెల్లడించారు.
Also Read: 80 శాతం మందిని వేధిస్తున్న మార్నింగ్ సిక్‌నెస్.. బయటపడే మార్గాలివే