14 ఏళ్లుగా గర్భవతే.. వచ్చే ఏడాది మార్చిలో డెలివరీ
దిశ, ఫీచర్స్ : 40 ఏళ్ల యూఎస్ మహిళ ఇటీవలే పదహారవ బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు ఇంకో ఏడాదిలోగా మరో బిడ్డను కనేందుకు ఎదురుచూస్తోంది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : 40 ఏళ్ల యూఎస్ మహిళ ఇటీవలే పదహారవ బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు ఇంకో ఏడాదిలోగా మరో బిడ్డను కనేందుకు ఎదురుచూస్తోంది. అవును.. మీరు విన్నది నిజమే! ఇప్పటికే 16 మంది పిల్లలకు తల్లయిన యూఎస్ లేడీ పాటీ హెర్నాండేజ్ మరోసారి గర్భందాల్చింది. త్వరలోనే తన ఫ్యామిలీలోకి 17వ బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధమైంది.
హెర్నాండేజ్ భర్త కార్లోస్.. ఓ క్లీనింగ్ కంపెనీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని సేవలకు గుర్తుగానే పిల్లలందరికీ 'C' అక్షరంతో పేర్లు పెట్టారు. హెర్నాండేజ్ విషయానికొస్తే.. ఆమె 14 ఏళ్లపాటు గర్భిణిగా గడిపినట్లు పేర్కొంది. ఈ జంటకు ఆరుగురు అబ్బాయిలు, పది మంది అమ్మాయిలు ఉండగా.. మూడు సెట్లు కవల పిల్లలే. మొదటి బిడ్డ కార్లోస్ జూనియర్‌కు 14 ఏళ్లు కాగా.. అందరికంటే చిన్నవాడు క్లేటన్ గతేడాదే పుట్టాడు. ఇక ప్రస్తుతం కడుపులో పెరుగుతున్న బిడ్డను మార్చిలో ప్రసవించనుంది.
'ప్రస్తుతం నేను 13 వారాల గర్భవతిని. 14 ఏళ్లుగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు 17వ బిడ్డను కనేందుకు ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాను' అని హెర్నాండేజ్ వెల్లడించింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ జంట గర్భనిరోధక పద్ధతులు ఉపయోగించరు. అదంతా దేవుడి నిర్ణయమని, ఒకవేళ మళ్లీ గర్భం దాల్చాలని దేవుడు కోరుకుంటే అలాగే జరుగుతుందనేది వాళ్ల విశ్వాసం.
ఇక ఈ జంటకు ఐదు పడక గదులతో కూడిన ఇల్లు ఉంది. హెర్నాండేజ్ తన పిల్లలను 20 సీట్ల బస్సులో పాఠశాలకు తీసుకెళ్తుంది. ఈ ఫ్యామిలీ మొత్తానికి ఫుడ్ కోసం వారానికి దాదాపు రూ. 72,000 వెచ్చిస్తున్నారు. అంతేకాదు మొత్తంగా 20 మంది పిల్లలు (అబ్బాయిలు10, అమ్మాయిలు10) కలిగే వరకు నియంత్రణ పద్ధతులు పాటించమని చెప్తున్నారు.
Also Read: ఎండ్రకాయల పెంకులతో ఎకో-ఫ్రెండ్లీ బ్యాటరీ..