48 మంది పిల్లలకు తండ్రి.. ఇంకా కొనసాగుతున్న వేట
దిశ, ఫీచర్స్ : ఈ ప్రపంచం అనేకానేక విచిత్ర జీవితాలు, భిన్న కథనాలకు వేదిక. అందరూ మనుషులే గానీ అలవాట్లు, అభిప్రాయాలే వేరు. అందుకే కొందరు నమ్మశక్యంకాని ఫీట్లు నమోదుచేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ఈ ప్రపంచం అనేకానేక విచిత్ర జీవితాలు, భిన్న కథనాలకు వేదిక. అందరూ మనుషులే గానీ అలవాట్లు, అభిప్రాయాలే వేరు. అందుకే కొందరు నమ్మశక్యంకాని ఫీట్లు నమోదుచేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే 48 మంది పిల్లలకు తండ్రి కావడమే కాక మరో 10 మందికి జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఒక అమెరికన్ కూడా ఇదే కోవకు చెందుతాడు. విశేషం ఏంటంటే.. ఇప్పటి వరకు అతను పెళ్లి చేసుకోలేదు సరికదా ఏ మహిళతోనూ శృంగార అనుభవం లేదు. అంతేకాదు తనతో రిలేషన్‌షిప్‌కు ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదు కూడా. మరి ఇంత బ్యాక్ స్టోరీ పెట్టుకుని ఇంతమందికి తండ్రి ఎలా అయ్యాడనే కదా? మీ డౌటానుమానం. అయితే ఓసారి ఇది చదవేయండి!
యూఎస్, లాస్ ఏంజెల్స్ నివాసి 31 ఏళ్ల కైల్ గోర్డి.. ఒక స్పెర్మ్ డోనర్. ఇప్పటివరకు తను డొనేట్ చేసిన వీర్యం ద్వారా 48 మంది పిల్లలు జన్మించారు. అయితే కైల్ చేస్తున్న పని కారణంగా ఏ అమ్మాయి కూడా తనతో డేటింగ్ లేదా మ్యారేజ్‌కు ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పటికీ సింగిల్ లైఫ్‌నే కొనసాగిస్తున్నాడు. అయినా ఇవన్నీ పట్టించుకోని కైల్.. తక్కువ కౌంట్ కారణంగా గర్భం దాల్చని వారికి తన స్పెర్మ్ దానం చేస్తున్నాడు. ఈ సేవల గురించి తను సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయటంతో కావలసిన మహిళలు కైల్‌ను నేరుగా సంప్రదిస్తారు. అయితే చాలామంది దాతలు ఎవరో తెలియని కారణంగా స్పెర్మ్ బ్యాంక్స్‌ను ఆశ్రయించేందుకు ఇష్టపడరని, అందుకే తాను డైరెక్ట్‌గా సర్వీస్ చేస్తున్నట్లు తెలిపాడు.
ఎన్నో కుటుంబాలకు సాయపడ్డా.. తను ఒంటరే!
గడిచిన ఎనిమిదేళ్లలో కైల్ వీర్యంతో 48 మంది మహిళలు తల్లులయ్యారు. కానీ తనకు మాత్రం పార్ట్నర్ దొరకడం లేదు. స్పెర్మ్ డోనర్ అని చెప్తే.. ఏ అమ్మాయి కూడా తనపై ఆసక్తి చూపడం లేదు. నిజానికి ఒక లెస్బియన్ జంట అభ్యర్థన మేరకే తాను 8 ఏళ్ల కిందట ఈ స్పెర్మ్ డొనేషన్ సర్వీస్ ప్రారంభించానని కైల్ చెప్పాడు. దీని తర్వాత ఆన్లైన్లో వస్తున్న అభ్యర్థనలకు ప్రతిస్పందిస్తూ ఇతర మహిళలకు ఇలా స్పెర్మ్ దానం చేయడం ప్రారంభించాడు.
డేటింగ్ టిప్స్.. ప్రొఫైల్‌లో కుక్క ఫొటోలతో గర్ల్స్ను ఈజీగా పడేయొచ్చు!