గిరిజన యువతిపై లైంగికదాడికి యత్నం

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం శంకర గిరిజన కాలనీకి చెందిన గడ్డం రామకృష్ణయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Update: 2023-05-24 14:03 GMT

దిశ, గూడూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం శంకర గిరిజన కాలనీకి చెందిన గడ్డం రామకృష్ణయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురుకు వివాహం జరిపించగా ఆమె అత్తవారింట్లో ఉంటోంది. ఇక రెండో ఇంట్లోనే ఉంటోంది. రామకృష్ణయ్య ఆటో డ్రైవర్. అతని భార్య ఒక ప్రైవేట్ కంపెనీలో దినసరి కూలీ. అయితే భార్యాభర్తలిద్దరూ పని కోసం బయటకు వెళ్లగా ఇంట్లో చిన్న కూతరు ఒక్కతే ఉంది.

ఈ క్రమంలోనే ఆమె స్నానం చేస్తుండగా పునరపివారి పాలెం కు చెందిన వాసు అనే యువకుడు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి సదరు యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఆమె భయంతో కేకలు పెట్టడంతో చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకుని యువకుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read..

సమ్మర్ సెలవులకు వచ్చిన చెల్లి.. ఏకంగా అక్క భర్తతోనే జంప్

Tags:    

Similar News