యూరిన్‌తో వెలిగే లైట్.. ఒక్కసారి నింపితే 45 రోజులపాటు వెలుగులు
సాధారణంగా నూనేతో లాంతర్‌ను వెలిగిస్తారు ఇది అందరికి తెలిసిన విషయమే.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా నూనేతో లాంతర్‌ను వెలిగిస్తారు ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ, ఎటువంటి నూనే అవసరం లేకుండా కేవలం ఉప్పు నీటితో లాంతరు వెలుగుతుంది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. అయితే ఈ లాంతరు కేవలం వెలుగులను ఇవ్వడానికే కాదు.. దీపం వెలుగుతూ ఉండగా మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
అర లీటరు సాల్ట్ వాటర్‌తో దాదాపు 45 రోజులు ఈ లాంతరు వెలుగుతుంది. ఇంతకీ ఉప్పునీటితో ఇదెలా వెలుగుతుందనేగా మీ అనుమానం. మామూలు లాంతరులో కిరోసిన్ నింపే బదులు, ఇందులో ఉప్పునీరు నింపుకోవాలి. దీని అడుగుభాగంలో అల్యూమినియం, కాపర్ ప్లేట్ ఉంటుంది. దాంతో జరిపే రసాయనిక చర్య వల్ల పుట్టే విద్యుత్తే దీనికి ఇంధనం. ఈ లాంతరు వెలుతురును కోరుకున్న విధంగా అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటూ కూడా ఉంది. ఒక వేళ ఉప్పునీరు దొరక్కపోతే యూరిన్‌ని ఉపయోగించి ఈ లాంతర్‌ని వాడుకోవచ్చు.
Also Read..
Bhola Shankar :మెగా ఫెస్టివల్ వచ్చేస్తుంది ‘భోళా శంకర్’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్