భర్త ఎట్టి పరిస్థితుల్లో భార్యకు ఈ మూడు విషయాలు చెప్పకూడదంట.. అవి ఏమిటంటే?
చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో గొప్పవిషయాలను తెలియజేశాడు. ఆర్థికంగా కానీ, ఇతరుల పట్ల ఎలా మెలగాలి, భార్యభర్తల గురించి అనేక విషయాలు తెలిపాడు. అయితే ఆయన
దిశ, వెబ్‌డెస్క్ : చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో గొప్పవిషయాలను తెలియజేశాడు. ఆర్థికంగా కానీ, ఇతరుల పట్ల ఎలా మెలగాలి, భార్యభర్తల గురించి అనేక విషయాలు తెలిపాడు. అయితే ఆయన నీతి శాస్త్రంలో భర్త ఎట్టి పరిస్థితుల్లో భార్యకు ఈ మూడు విషయాలు చెప్పకూడదు. చెప్తే చిక్కుల్లో పడ్డట్లే అని తెలిపాడు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి దాపరికం లేకుండా ఇద్దరూ కలిసి జీవితం కొనసాగిస్తారు. కానీ కొన్ని విషయాలు మాత్రం భర్త, భార్యతో పంచుకోకూడదంట. అందులో ఒకటి, బలహీనతలు. భర్త తన బలహీనతలు ఎట్టిపరిస్థితుల్లో భార్యకు చెప్పకూడదంట. చెప్తే చులకనయ్యే అవకాశం ఉందంట.
2. తన ఫస్ట్ లవ్ గురించి భర్త ఎప్పుడూ భార్యకు చెప్పకూడదంట. దీని వలన ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చే అవకాశం ఉందంట. అంతే కాకుండా భార్యకు, భర్త మీద ఉండే నమ్మకం, ప్రేమ తగ్గిపోతుందంట.
3.ముఖ్యంగా ప్రతి భర్త ఎంత సంపాదిస్తున్నాడు అనే విషయం భార్యకు తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. కానీ భర్త జీతం గురించి భార్యకు పూర్తిగా చెప్పకూడదని చాణిక్యుడు అంటున్నారు. ఎందుకంటే భర్త జీతం పెరిగితే భార్య ఖర్చులు కూడా పెరుగుతాయని అంటున్నారు. అందుకే తక్కువ చేసి చెప్పాలంట.
Also Read..