సంబంధాల్లో సంఘర్షణ.. బలమైన అనుబంధానికి మరో మార్గం !

లైఫ్ అన్నాక రిలేషన్‌షిప్‌లో సమస్యలు, సంఘర్షణలు, సామరస్యం అన్నీ ఉంటాయి. తగాదాలు రావడం, తర్వాత సర్దుకోవడం కామన్. పైగా ఈ గొడవలు ఒక విధంగా మేలు చేస్తాయి.

Update: 2024-02-17 12:55 GMT

దిశ, ఫీచర్స్ : లైఫ్ అన్నాక రిలేషన్‌షిప్‌లో సమస్యలు, సంఘర్షణలు, సామరస్యం అన్నీ ఉంటాయి. తగాదాలు రావడం, తర్వాత సర్దుకోవడం కామన్. పైగా ఈ గొడవలు ఒక విధంగా మేలు చేస్తాయి. లోపాలను తెలుసుకొని మసలుకోవడంలో సహాయపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సంఘర్షణ మీ దాంపత్య జీవితం యొక్క మనుగడకు కీలకంగా మారుతుందని నిపుణులు. పార్టనర్స్ మధ్య లోతైన అవగాహనకు, స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్‌కు చిన్న చిన్న గొడవలను అవకాశంగా స్వీకరించాలని సూచిస్తున్నారు.

అపార్థాలు.. ఆందోళనలు

ఎలాంటి విభేదాలు లేని సంబంధాలు ఎంతో ఆదర్శంగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి సామరస్యమే లోతైన సమస్యను దాచిపెట్టే అవకాశం లేకపోలేదని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన సంఘర్షణకు భయపడే బదులు దానిని స్వీకరించడం అభివృద్ధి చెందుతున్న అనుబంధానికి కీలకం కావచ్చు అంటున్నారు. రిలేషన్‌షిప్‌లో విభేదాలు సహజం. అయితే వాటిని గుండెల్లో దాచుకోగల హెల్తీ కమ్యూనికేషన్ కూడా ఉంది. నిజానికి భార్యభర్తలు లేదా సహజీవనం చేస్తున్న స్త్రీ, పురుషుల మధ్య ఆందోళనలు, భావోద్వేగాలు మూటగట్టుకున్నప్పుడే అపార్థాలు కనిపిస్తుంటాయి. క్రమంగా సంఘర్షణకు దారితీస్తాయి. ఈ పరిస్థితిని నివారించడానికి ఎమోషనల్ లిటరసీ, అవగాహన చాలా ముఖ్యం.

నమ్మకాన్ని పెంచే నైపుణ్యం

భావోద్వేగాలను, సంఘర్షణలను అర్థం చేసుకోవడం, వ్యక్తీకరించడం, ధృవీకరించడం అనేది నమ్మకమైన అనుబంధాన్ని పెంపొందించే ముఖ్యమైన నైపుణ్యాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఒకరు చెప్పేది మరొకరు శ్రద్ధగా వినడం, ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం సంబంధంలో గొడవలు తగ్గించగల సురక్షితమైన స్థలాన్ని క్రియేట్ చేసుకోవడం ముఖ్యం. దీనివల్ల సమస్య పరిష్కారానికి భావోద్వేగ శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుంది.

అభివృద్ధికి సంకేతం..

తగాదాలు ప్రమాదకరమైవి ఏమీ కావు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకోవడం, భావోద్వేగాలను అణచిపెట్టుకోవడం మాత్రమే ఎక్కువగా విభేదాలకు కారణం అవుతుంటాయి. కూల్‌గా ఆలోచిస్తే అవి కేవలం కొద్దిసేపు ఉండిపోయే చిన్నపాటి తుఫాన్ లాంటివి. ఫైనల్‌గా బంధాలను బలోపేతం చేసే ఒక అభివృద్ధి సంకేతంగా ఈ సంఘర్షణ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. విభేదాల పరిష్కారానికి సరిహద్దులను సెట్ చేయడం, ఓపెన్ కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించడం, సెల్ఫ్ అవేర్ నెస్‌కు ప్రయారిటీ ఇవ్వడం వంటివి బంధాలను మరింత బలోపేతం చేస్తాయి.

పర్సనల్ స్పేస్ అవసరం

ప్రతి సంబంధానికి ఉమ్మడి, అలాగే వ్యక్తిగత అవసరాలు ఉంటాయి. కాబట్టి అవసరం అయినప్పుడు దంపతుల మధ్య ఆరోగ్యకరమైన దూరం కూడా అవసరం. అలాగని మరీ ఎక్కువకాలం విడిగా ఉంటే అది ఎమోషనల్ ఐసోలేషన్‌కు దారితీయవచ్చు. అలాగని ప్రతి సందర్భంలోనూ ఒకరిని వదలకుండా మరొకరు వెంబడించినట్లు ఉంటే కూడా ఒకరి వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కావచ్చు. కాబట్టి ఈ సమతుల్యాన్ని కనుగొనడంలో ఓపెన్ కమ్యూనికేషన్. సెట్టింగ్ బౌండరీస్, పర్సనల్ స్పేస్ చాలా ముఖ్యం.


Similar News