మీ గోర్లు అందంగా ఉండాలనుకుంటున్నారా .. ఈ చిట్కాలు పాటించండి
ఈ మధ్యకాలంలో చాలా మంది యువత ఆరోగ్యం, అందంపై దృష్టి సారించడం మాత్రమే కాకుండా, తమ గోర్లు కూడా అందంగా పెరగాలనుకుంటున్నారు.
దిశ,వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో చాలా మంది యువత ఆరోగ్యం, అందంపై దృష్టి సారించడం మాత్రమే కాకుండా, తమ గోర్లు కూడా అందంగా పెరగాలనుకుంటున్నారు. అందు కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకంటారు. గోళ్ళను శుభ్రం చేసుకోవడం గ్రూమింగ్ వంటివి చేపిస్తూ ఉంటారు. అంతే కాదు అప్పుడప్పుడు సంబంధిత వైద్యుల వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు.
పార్లర్ లకి వెళ్లి మానిక్యూర్ చేయించుకుంటూ వుంటారు. కానీ కొంత మంది మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అయితే గోళ్లను శుభ్రం చేయించుకోవడానికి పార్లర్ వంటి చోటకి వెళ్లాల్సిన పని కూడా లేదు. ఏం చక్కా ఇంట్లోనే ఉండి గోళ్ళను శుభ్రంగా ఉంచుకోవచ్చు. అసలు ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా గోళ్లను ఉంచుకోవాలి ఇప్పుడు చూద్దాం. కొంత మంది వైద్య నిపుణులు చిట్కాలని పాలో అవుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు ఏంటో చూద్దాం.
గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ పొట్టిగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మంచిదని, దాంతో గోళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయని చెపుతున్నారు. గోళ్లను పొడుగుగా ఉంచాలనుకుంటే వాటిని స్క్వేర్ రౌండ్ ఆకారంలో కట్ చేసుకోవాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. అంతే కాదు గోళ్లు ఆరోగ్యంగా పెరగాలంటే నెయిల్ ఫోల్డ్ దగ్గర మాయిశ్చరైజర్ అప్లై చెయ్యాలి. గోర్లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి గ్లిజరిన్, ఆయిల్ ను రాసుకోవచ్చు. అలా చేయడం వలన గోర్లు డల్ గా ఉండకుండా మంచి షైనింగ్ తో ఉంటాయి.
కొంత మందిలో గోర్లు ఎక్కువగా పెరగకుండా తరచూ విరుగుతూ ఉంటాయి. అలా విరిగినపుడు వారిలో ఐరన్ లోపం లేదా థైరాయిడ్ సమస్య ఉన్నట్లు గ్రహించాలి. సరైన చికిత్సను తీసుకుంటూ పోషకాలను తీసుకుంటే ఈ సమస్య నెమ్మదిగా తగ్గుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ గోళ్లు అందంగా పెరగాలనుకుంటే ఈ చిన్న చిట్కాలను పాటించండి. అందమైన గోళ్లను పొందండి.