సరదాగా ఉండట్లేదని జాబ్ నుంచి పీకేశారు.. కోర్టులో గెలిచిన ఉద్యోగి
కంపెనీ పని గంటల తర్వాత సరదాగా, సానుకూలంగా ఉండట్లేదని ఓ సంస్థ ఉద్యోగిని తొలగించింది.
దిశ, ఫీచర్స్: కంపెనీ పనిగంటల తర్వాత సరదాగా, సానుకూలంగా ఉండట్లేదని ఓ సంస్థ ఉద్యోగిని తొలగించింది. ఇలాంటి ఎంప్లాయిస్ తమకు అవసరం లేదని ఫైర్ చేసింది. 2015లో ఈ ఘటన జరగ్గా.. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్న సదరు ఎంప్లాయికి జస్టిస్ లభించింది. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుందని తాజాగా తీర్పునిచ్చిన ఫ్రాన్స్ దేశ న్యాయవ్యవస్థ.. అతనికి నష్టపరిహారం చెల్లించాలని కంపెనీకి సూచించింది.
మీరు మీ యజమానిని, సహోద్యోగులను ద్వేషిస్తున్నారా? వారి నిర్ణయాలకు అనుకూలంగా ఉండట్లేదని వివక్ష చూపుతున్నారా? కంపెనీ నుంచి తొలగించారా? ముమ్మాటికీ ఇది అన్యాయమేనని స్పష్టం చేసింది ఫ్రాన్స్ కోర్టు. విషయానికొస్తే.. Mr T 2011లో పారిస్ ఆధారిత కన్సల్టింగ్ కంపెనీ అయిన క్యూబిక్ పార్ట్‌నర్స్‌లో చేరాడు. అయితే 'వృత్తిపరమైన లోపం'తో 2015లో తొలగించబడ్డాడు. కోర్టులో అతను సమర్పించిన పత్రాల ప్రకారం.. Mr T పని గంటల తర్వాత సెమినార్స్ అండ్ డ్రింక్స్ కలిగి ఉన్న సంస్థ 'సరదా, అనుకూల' విలువలకు కట్టుబడి ఉండటానికి నిరాకరించినందున రిమూవ్ చేయబడ్డాడు.
దీంతో సదరు ఉద్యోగి క్యూబిక్ పార్ట్‌నర్స్‌ను లేబర్ కోర్టు మెట్లెక్కించాడు. ఈ క్రమంలో ఈ కేసు దేశం అత్యున్నత న్యాయస్థానం ఫ్రెంచ్ కోర్ట్ ఆఫ్ కాసేషన్‌కు చేరుకోవడంతో చర్చనీయాంశమైంది. మొత్తానికి 'క్యూబిక్ పార్ట్‌నర్స్' విలువలకు కట్టుబడి ఉండటానికి Mr T తిరస్కరణ.. అతని అభిప్రాయ, వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమని న్యాయస్థానం పరిగణించింది. 'పరువుతో గోప్యత ఉద్యోగి ప్రాథమిక హక్కు'గా గుర్తించింది. ప్రత్యేకించి కంపెనీ కార్యకలాపాలు 'అధిక మద్యపానం, వ్యభిచారం, బెదిరింపులు, మితిమీరిన దుష్ప్రవర్తనకు ప్రేరేపించడం'లో భాగంగా ఉన్నాయని భావించిన కోర్టు వార్నింగ్ ఇచ్చింది. పరిహారంగా €3,000 (రూ.2.50లక్షలు)చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. అయితే Mr T న్యాయపరమైన ఖర్చులు, ఆదాయాల నష్టాలు కలిగిన కారణంగా రూ. 4 కోట్లు డిమాండ్ చేయడంతో కేసు కొనసాగుతుందని తెలిపింది.
ప్రొఫెషనల్ - పర్సనల్ లైఫ్‌ను వేరు చేయలేకపోతున్నామా?
కొవిడ్-19 మహమ్మారి కాలం నుంచి పనిచేసే విధానాల్లో మార్పు వచ్చింది. లక్షలాది మంది ఎంప్లాయిస్ 'గ్రేట్ రిసిగ్నేషన్' పేరుతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన తర్వాత.. ప్రస్తుతం 'నిశ్శబ్ద నిష్క్రమణ(క్వైట్ క్విట్టింగ్)' ట్రెండ్ కొనసాగుతోంది. ఇవి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సరిహద్దుల స్పష్టమైన అంగీకారంగా కనిపిస్తున్నాయి. నిజానికి సాంప్రదాయకంగా పనిచేసిన విధానం గతంలో కంటే ఇప్పుడు సవాల్ చేయబడుతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత ఆఫీసుకు తిరిగి రావడంతో.. వర్క్-రిలేటెడ్ సోషల్ ఈవెంట్స్.. పని జీవితాన్ని ప్రైవేట్ సమయం నుంచి వేరు చేయడం మరోసారి సవాలుగా మారుతోంది.
READ MORE