కూతురి కలను సాకారం చేయడానికి ఓ లాయర్ ఈ పని చేస్తోంది..?! (వీడియో)
తన భర్త ఆమెను వదిలేసి వెళ్లాడు. Women from Jhalander, in Punjab, selling Paratha to rise her child as Olympic Player.
దిశ, వెబ్‌డెస్క్ః తల్లి తన పిల్లల కోసం ఎలాంటి త్యాగమైనా చేస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కెరీర్‌ను కూడా ఖాతరు చేయకుండా కన్నవారి కోసం కష్టాలను కూడా ఇష్టంగా మార్చుకుంటుంది. అలాంటి కథే ఈ అమ్మది. చదవింది లాయరమ్మ.. కానీ పరాఠాలమ్మే పని చేస్తోంది. ఏడాది బిడ్డ పొత్తిళ్లలో ఉన్నపుడు తన భర్త ఆమెను వదిలేసి వెళ్లాడు. అయితే, ఒంటరి తల్లిగా ఆమె జీవితమే ఆమెకొక పాఠం అయ్యింది. లాయర్ చదివింది. ఇప్పుడు తన కుమార్తెను ఒలింపిక్ వేదికపై చూడటానికి తాను అహిర్నిశలూ శ్రమిస్తోంది. దాని కోసమే ఓ క్వాలిఫైడ్ లాయర్ ఫుడ్ స్టాల్‌ను నడుపుతోంది.
ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణ ఇస్తోంది. 'తుఫానును ఎదురొడ్డి గమ్యాన్ని చేరుకో..' అంటూ సాగే ఓ హిందీ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో నేహశర్మ జీవితం ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. ఇందులో ఆమె శ్రమ షెడ్యూల్ చాలా సింపుల్... జలంధర్‌లో నివశించే నేహా శర్మ తన ఫుడ్ స్టాల్ 'శర్మ పరాఠా జంక్షన్'కి స్కూటీపై వెళ్తుంది. పంజాబ్‌లో ఇంకెక్కడా దొరకనంత పెద్ద పరాఠాను కేవలం రూ. 50కి అందిస్తుంది. ఆమె ఏది చేసినా ప్రస్తుతం 15 ఏళ్లున్న తన కుమార్తెను ఒలింపిక్‌కు పంపించడమే ధ్యేయంగా పనిచేస్తుంది. పీకల లోతు కష్టాలున్నా మొహంపై నవ్వు చెరగనీయని ఆమె సాహసం ఈ వీడియోలో బంధీ అయ్యింది.