తోకతో పుట్టిన చిన్నారి.. ఒక్కసారిగా షాకైన వైద్యులు

చైనాలోని హాంగ్‌జౌ ప్రావిన్స్‌లో వింతఘటన చోటు చేసుకుంది. నెలలు నిండిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా శిశువులు పుట్టగానే కొందరిలో జన్యుపరమైన

Update: 2024-03-16 10:38 GMT

దిశ, ఫీచర్స్ : చైనాలోని హాంగ్‌జౌ ప్రావిన్స్‌లో వింతఘటన చోటు చేసుకుంది. నెలలు నిండిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా శిశువులు పుట్టగానే కొందరిలో జన్యుపరమైన లోపాలు ఉంటాయి. కానీ చైనాలోని ఓ మహిళకు మాత్రం ఏకంగా తోక ఉన్న పాప పుట్టింది. గర్భిణీకి ఆపరేషన్ చేసిన తర్వాత పసికందుకు తోక ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. తోక ఉన్న చిన్నారిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యారు. చిన్నారి వెనుక వైపున వీపు కింది భాగంలో సుమారు 10 సెంటీ మీటర్లు అంటే 3.9 అంగుళాల పొడవుతో తోక ఉంది. అయితే ఇది అసంపూర్ణమైన క్షీణత వల్ల వచ్చినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తోకను తొలగించమని వైద్యులను కోరగా, అది నాడీ వ్యవస్థతో అనుసంధానమై ఉండటంతో శస్త్రచికిత్స చేసి దానిని తొలిగించడం కుదరదని వైద్యులు తెలిపారు. దీంతో ఆ చిన్నారికి తోక అలానే ఉంది. ఇక ఈ అరుదైన సంఘటన ఇప్పడే కాకుండా, అమెరికాలో కూడా ఒక కేసు నమోదైనదంట.కాగా,ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Similar News