Calendar : అక్టోబర్‌ నెలలో 21 రోజులే.. మిగతా పది రోజులు ఏమయ్యాయి అంటే?

సాధారణంగా క్యాలెండర్ అంటే 12 నెలలు 365 రోజులు ఉంటాయి. ఇక ఇందులో ఫిబ్రవరిలో 28 రోజులు, లీప్ సంవత్సరం వస్తే 29 రోజులు ఉంటాయి. ఇక ఎప్పటికీ అక్టోబర్‌లో మాత్రం 31 రోజులు ఉంటాయి.

Update: 2024-07-24 07:26 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా క్యాలెండర్ అంటే 12 నెలలు 365 రోజులు ఉంటాయి. ఇక ఇందులో ఫిబ్రవరిలో 28 రోజులు, లీప్ సంవత్సరం వస్తే 29 రోజులు ఉంటాయి. ఇక ఎప్పటికీ అక్టోబర్‌లో మాత్రం 31 రోజులు ఉంటాయి. కానీ ఒక సంవత్సరంలో మాత్రం అక్టోబర్ నెలలో కేవలం 21 రోజులు మాత్రమే ఉన్నాయి. అది ఏంటీ 31 రోజులు కదా ఉండాల్సింది? మరి 10 రోజులు ఏమైనట్టు, నిజంగా ఇది నిజమేనా? ఇది సంవత్సరంలో జరిగింది అని ఆలోచిస్తుంటారు ? కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే 1582వ సంవత్సరం క్యాలెండర్‌లో అక్టోబర్‌లో 4వ తేదీ తర్వాత డైరెక్ట్‌గా 15 వ తేదీ స్టార్ట్ అయ్యింది. మరి మధ్యలో 10 రోజుల ఏమి అయ్యాయంటే?. ఈ క్యాలెండర్‌ను క్రీస్తుపూర్వం 40లో రోమన్ పాలకులు జూలియస్ సీజర్ ప్రచురించారు. ఇక సాధారణ సౌర సంవత్సరం కంటే 11 నిమిషాల 14 సెకన్లు ఎక్కువ. ఈ విధంగా జూలియన్ క్యాలెండర్ 314 సంవత్సరాల పాటు ఒక రోజు పురోగమిస్తుంది. దాని కారణంగా 1582లో క్యాలెండర్ భూమి కక్ష్య తో పోలిస్తే 10 రోజులు అదనంగా ఉండటం వలన క్రైస్తవులకు ఈస్టర్ తేదీని నిర్ణయించడం కష్టతరం అయ్యిందంట. పోప్ గ్రెగరీ 1582లో తయారు చేసే క్రమంలో అక్టోబర్‌లో 10 రోజులను దాట వేశారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more...

Devils: దెయ్యాల దీవి.. అక్కడికి వెళ్లారో..! 

Tags:    

Similar News