93ఏళ్ల వృద్దురాలి వింగ్ వాకింగ్ స్టంట్.. వీడియో వైరల్
దిశ, ఫీచర్స్ : 70ఏళ్లు పైబడిన వృద్ధులెవరైనా తమ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకే టైమ్ కేటాయిస్తారు.
దిశ, ఫీచర్స్ : 70ఏళ్లు పైబడిన వృద్ధులెవరైనా తమ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకే టైమ్ కేటాయిస్తారు. కానీ యూకేకు చెందిన 93 ఏళ్ల బెట్టీ బ్రోమేజ్‌కు మాత్రం అలా ఇంట్లోనే ఓ మూలకు కూర్చోవడం అస్సలు ఇష్టం లేదు. వయసుతో సంబంధం లేకుండా లైఫ్‌ను జాలీగా గడపాలనుకునే ఆమె.. వింగ్ వాకింగ్ ద్వారా గాలిలో ఎగురుతూ తాజాగా ఐదోసారి హై-ఫ్లైయింగ్ చాలెంజ్‌ను పూర్తి చేసింది.
వింగ్ వాకింగ్ అంటే విమానం ప్రయాణిస్తుండగా దాని రెక్కలపై నడిచే ఒక ప్రక్రియ. ఇటీవల సిరెన్‌సెస్టర్ సమీపంలోని రెండ్‌కాంబ్ ఎయిర్‌ఫీల్డ్‌లో జరిగిన ఈ వింగ్ వాక్‌లో పాల్గొన్న బెట్టీ రెక్కల మీద నడవలేదు. కానీ ఫ్లైట్‌పై తనను ఒక పట్టీతో సురక్షితంగా కట్టడం జరిగింది. ఇక ఈ స్టంట్‌ను రికార్డ్ చేసిన బీబీసీ.. షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఫీట్‌పై స్పందించిన బెట్టీ.. 'ఇది చాలా బాగుంది. నేను చాలా సంతోషపడ్డాను. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి స్టంట్‌లు చేయనివారు ట్రై చేయొచ్చు' అంటూ పేర్కొంది. ఇక గతంలో ఐటీవీ ప్రైడ్ ఆఫ్ బ్రిటన్ అవార్డు గెలుచుకున్న బెట్టి.. స్థానిక స్వచ్ఛంద సంస్థల కోసం £23,000(దాదాపు రూ. 22 లక్షలు)పైగా సేకరించింది.