64 ఏళ్లకు భర్త రాసిన లేఖ చదివి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. అందులో ఏముందంటే..

మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రానప్పుడు ప్రజలు తమ ప్రేమను డైరెక్టుగా లేదా ప్రేమలేఖల ద్వారా తెలిపేవారు.

Update: 2024-02-28 03:00 GMT

దిశ, ఫీచర్స్ : మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రానప్పుడు ప్రజలు తమ ప్రేమను డైరెక్టుగా లేదా ప్రేమలేఖల ద్వారా తెలిపేవారు. అప్పట్లో ప్రేమికులు ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకుని తమ భావాలన్నింటినీ అందులో వ్యక్తం చేసేవారు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు అన్నింటినీ మార్చివేసినప్పటికీ, ఆ పాత ప్రేమలేఖలను గుర్తుచేసుకుంటే, వారు కూడా భావోద్వేగానికి గురవుతారు. అలాంటి ఒకటి సంఘటన ఈ మధ్య కాలంలో వెలుగులోకివచ్చింది. ఇటీవల వాల్ అనే మహిళ తన భర్త రాసిన భావోద్వేగ ప్రేమ లేఖను కనుగొంది. ఆ లేఖను గత 64 సంవత్సరాలుగా వాల్‌పేపర్‌లో దాచారు.

మెట్రో నివేదిక ప్రకారం వాల్ అనే మహిళ ఇంగ్లాండ్‌లోని డెవాన్ నగర నివాసి. ఇటీవల ఆమె తన మనవరాలి కోసం ప్రత్యేక గదిని డిజైన్ చేయడానికి తన ఇంటిని మరమ్మతు చేస్తోంది. ఈ సమయంలో ఆమె వాల్పేపర్ కింద ఒక ప్రేమ లేఖను చూసింది. దాని పై ఆమె భర్త పేరు, చిరునామా రాసి ఉంది. రోజ్ అనే అమ్మాయికి ఈ ప్రేమ లేఖ రాశారు. అప్పుడు వాల్ పేరు నిజానికి రోజ్. ఈ ప్రేమలేఖలో పేరుతో పాటు హార్ట్ సింబల్ వేసి పెళ్లి తేదీ కూడా ఉంది.

1960లో రాసిన ప్రేమలేఖ..

ఈ లేఖను వాల్ భర్త కెన్ 64 ఏళ్ల క్రితం రాశారు. అప్పటికి అతనికి పెళ్లి కూడా కాలేదు. ఆగస్టు 1960లో ఈ లేఖ రాశారు. 1959 సంవత్సరంలో ఎక్స్‌మౌత్‌లో జరిగిన ఓ నృత్య కార్యక్రమలో కెన్‌ను కలిశానని వాల్ చెప్పింది. అప్పుడు కేన్ వయసు 21 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత క్రమంగా వారి మధ్య స్నేహం పెరిగి స్నేహం ప్రేమగా మారింది. 1996లో కెన్ చనిపోయే వరకు ఇద్దరూ దాదాపు 36 సంవత్సరాలు కలిసి జీవించారు. ఇప్పటి వరకు కెన్‌తో గడిపిన ఆ క్షణాలను వాల్ ఎంతో గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఆమెకు ఈ ప్రేమలేఖ వచ్చినప్పుడు అది చదివిన తర్వాత ఆమె పూర్తిగా భావోద్వేగానికి గురైంది.

హృదయాన్ని హత్తుకునే ఈ మహిళ కథ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, ప్రజలు కూడా వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. దీని పై ఒకరు తమ బాధను వ్యక్తం చేశారు. కెన్ ఈ రోజు జీవించి ఉంటే అతను ఈ క్షణాన్ని చూసి సంతోషంగా ఉండేవాడని భావిస్తున్నారు.

Tags:    

Similar News