తెలుగు రాష్ట్రాల్లో 5జీ సేవలు.. త్వరలో అక్కడ ఒక్క చోటే..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని ఇటీవల 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల వేలంలో టెలీకాం సంస్థ ఈ స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని ఇటీవల 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల వేలంలో టెలీకాం సంస్థ ఈ స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ 5జీ సేవలు సెప్టెంబరు 29 నుంచి అందుబాటులోకి రానున్నట్లు భారీ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సేవలను మొదటి విడతగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగుళూరు, చెన్నై, పూణె, అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, జామ్ నగర్, గురుగ్రామ్, గాంధీగ్రామ్ వంటి నగరాల్లో అందించనున్నారు. దీంతోపాటు ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అనంతరం దశల వారీగా దేశంలో మిగతా రాష్ట్రాల్లో విస్తరించాలని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : దేశ నలుమూలల్లో 5జీ.. ఆ ప్రాంతాలపై ఫోకస్..: కేంద్ర మంత్రి