వ్యాక్సిన్ అందక 50వేల మంది చిన్నారుల మరణం..
టైమ్‌కు వ్యాక్సిన్ అందకపోవడంతో 2020 నుంచి 2030 మధ్య కాలంలో చిన్నారుల అదనపు మరణాల సంఖ్య 50 వేలను మించిందని
దిశ, ఫీచర్స్:టైమ్‌కు వ్యాక్సిన్ అందకపోవడంతో 2020 నుంచి 2030 మధ్య కాలంలో చిన్నారుల అదనపు మరణాల సంఖ్య 50 వేలను మించిందని తాజా అధ్యయనం వెల్లడించింది. కొవిడ్ కారణంగా ఏర్పడిన ఈ అంతరాయం పిల్లల నిండు ప్రాణాలను బలి తీసుకున్నట్లు తెలిపింది. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ప్రకారం.. మీజిల్స్, రుబెల్లా, హ్యూమన్‌పాపిల్లోమావైరస్ (HPV), హెపటైటిస్ B, మెనింజైటిస్ A, ఎల్లో ఫీవర్ టీకాల కవరేజీపై COVID-19 భారీ ఎఫెక్ట్ చూపింది. ఈ అదనపు మరణాలలో 30వేల కంటే ఎక్కువ మంది ఆఫ్రికా, 13వేల మంది పిల్లలు ఆగ్నేయాసియాకు చెందినవారు కాగా.. అధికంగా మీజిల్స్ వ్యాక్సిన్ కవరేజీ అంతరాయం కారణంగానే చనిపోయారు. మీజిల్స్ ఇమ్యునైజేషన్‌లో లోపమే ప్రపంచవ్యాప్తంగా 44,500 కంటే ఎక్కువ మంది చనిపోయేందుకు కారణమైందని అంచనా.
కాగా ఈ అధ్యయనం ఫలితాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆఫ్రికన్, ఆగ్నేయాసియా ప్రాంతాలలో మీజిల్స్ నియంత్రణ అవసరాలన్ని హైలైట్ చేశాయి. క్యాచ్ అప్ ప్రోగ్రామ్స్ చేపడితే.. 2030 వరకు 80శాతం అదనపు మరణాలను నివారించగలమని అంతర్జాతీయ పరిశోధకుల బృందం సూచించింది. ప్రస్తుతమున్న సవాళ్లను అధిగమించేందుకు, ఆరోగ్య సంరక్షణను పెంచేందుకు సమిష్టి ప్రయత్నాలు అవసరమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.