Viral : కొడుకు కోసం అర్ధరాత్రి కూడా ఆటో నడుపుతున్న 50ఏళ్ల మహిళ.. గర్వంగా ఉందంటున్న నెటిజన్లు..

సాధారణంగా ఇన్ ఫ్లుయెన్సర్స్, వ్లాగర్స్ వైరల్ కంటెంట్ కోసం ట్రై చేస్తారు. కొత్తగా ఏది కనిపించినా సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఈ క్రమంలోనే ఓ 5 0 ఏళ్ల మహిళ అర్ధ రాత్రి ఆటో నడపడం చూసిన ఇన్ ఫ్లుయెన్సర్..

Update: 2024-09-05 10:00 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఇన్ ఫ్లుయెన్సర్స్, వ్లాగర్స్ వైరల్ కంటెంట్ కోసం ట్రై చేస్తారు. కొత్తగా ఏది కనిపించినా సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఈ క్రమంలోనే ఓ 5 0 ఏళ్ల మహిళ అర్ధ రాత్రి ఆటో నడపడం చూసిన ఇన్ ఫ్లుయెన్సర్.. తనతో మాట్లాడుతూనే వీడియో తీశాడు. నెట్టింట పోస్ట్ చేశాడు. అసలు ఎందుకు ఈ టైంలో ఆటో నడుపుతున్నారని ప్రశ్నిస్తే... భర్త ఎప్పుడో చనిపోయాడని, ఎదిగిన కొడుకు తననే డబ్బులు అడుగుతాడని చెప్పుకొచ్చింది. అందుకే పగలు, రాత్రి తేడా లేకుండా ఆటో నడుపుతానంటున్న ఆమె.. మరి భయం లేదా అని అడిగితే.. అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

అడుక్కునేందుకు భయపడాలి కానీ ఆటో డ్రైవ్ చేసేందుకు ఎందుకు భయపడాలని అంటుంది. ఇక ఈ వీడియో చూసిన జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యోధురాలికి సెల్యూట్ అని కొందరు అంటుంటే.. ఆమె కొడుకు మనిషిగా ఫెయిల్ అయ్యాడని ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Tags:    

Similar News