నాలుగేళ్ల బాలికకు రేర్ హెల్త్ కండిషన్.. గాలి సోకినా ఎలర్జీనే!

దిశ, ఫీచర్స్ : నాలుగేళ్ల ఆస్త్రేలియన్ గర్ల్ ‘క్లారా క్లార్క్’ తోటి పిల్లల మాదిరి రోజువారీ జీవితాన్ని గడపలేని అరుదైన పరిస్థితులతో బాధపడుతోంది. గాలి సహా బయటి ప్రపంచానికి ఎక్స్‌పోజ్ అయితే తీవ్ర ఎలర్జీలు తలెత్తే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది..Latest Telugu News

Update: 2022-06-08 07:48 GMT

దిశ, ఫీచర్స్ : నాలుగేళ్ల ఆస్త్రేలియన్ గర్ల్ 'క్లారా క్లార్క్' తోటి పిల్లల మాదిరి రోజువారీ జీవితాన్ని గడపలేని అరుదైన పరిస్థితులతో బాధపడుతోంది. గాలి సహా బయటి ప్రపంచానికి ఎక్స్‌పోజ్ అయితే తీవ్ర ఎలర్జీలు తలెత్తే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. 'మాస్ట్ సెల్ యాక్టివేషన్'గా పిలువబడే ఈ సిండ్రోమ్‌ కారణంగా గాలిలోని రసాయనాలు, చల్లని వాతావరణం, చివరకు దోమ కాటు వల్ల కూడా ఆమె అనారోగ్యానికి గురవుతోంది. దీంతో క్లారాను బయటకు తీసుకెళ్లాలంటే తప్పకుండా మెడిసిన్స్ వేయాల్సిన పరిస్థితి. 2021లో లక్షణాలు తీవ్రరూపం దాల్చడంతో స్కూల్‌ కూడా మానేయాల్సి వచ్చింది. వైద్య చికిత్సకు దాతలు సాయపడకుంటే ఇక ఆమె ఎప్పటికీ స్కూల్‌కు వెళ్లలేదని పేరెంట్స్ బాధపడుతున్నారు.

అనేక సిండ్రోమ్స్ :

క్లారా పుట్టుకతో వచ్చే సుక్రేజ్-ఐసోమాల్టేస్ లోపం (CSID) తో పాటు ఫుడ్ ప్రొటీన్-ప్రేరిత ఎంట్రోకోలిటిస్ సిండ్రోమ్ (FPIES), ఫ్రక్టోజ్ మాల్‌అబ్జార్‌ప్షన్ కోల్డ్ ఉర్టికేరియా స్కీటర్స్ సిండ్రోమ్‌తో కూడా బాధపడుతోంది. ఈ రుగ్మతల మూలంగా తీవ్రమైన కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్ ఎదుర్కొంటోంది. కాగా తమ చిన్నారిని కంటికి రెప్పలా చూసుకునేందుకు క్లారా తల్లి ఎలిసా తమ వ్యాపారాన్ని కూడా వదులుకుంది. అయితే అవసరమైన మందులు, స్పెషలిస్ట్ అపాయింట్‌మెంట్స్, ప్రత్యామ్నాయ చికిత్సల కోసం చాలా డబ్బులు అవసరం కాగా.. కేవలం ఎయిర్ ప్యూరిఫైయర్స్‌ కోసమే వారానికి రూ. 8 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'క్రౌడ్ సోర్స్' ద్వారా 'GoFundMe' కూడా ఏర్పాటు చేసింది.

మా కూతురుకు నయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. రెడ్ లైట్ థెరపీ సహా కాంపౌండెడ్ మెడికేషన్స్ వాడాం. పేరొందిన నిపుణులను కలిశాం. ఆమె అనారోగాన్ని పొగొట్టేందుకు మరింత ఖర్చు పెట్టేందుకు సిద్ధం. క్లారా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటమే మాకు కావాల్సింది. అదే జరిగితే ఆమె అనుకున్నవన్నీ తినవచ్చు, పాఠశాలకు వెళ్లవచ్చు. ముఖ్యంగా సాధారణ జీవితం గడపొచ్చు.

- క్లారా తల్లి ఎలిసా 


Similar News