Style of 2024:కాంప్లికేటెడ్ నుంచి సింప్లిసిటీ వైపు.. రిలేషన్‌షిప్స్‌లో న్యూ ట్రెండ్స్!
కాలం ఎవరికోసమూ ఆగదు. మనకు నచ్చినా నచ్చకపోయినా దానిపని అది చేసుకుపోతూనే ఉంటుంది.
దిశ, ఫీచర్స్: కాలం ఎవరికోసమూ ఆగదు. మనకు నచ్చినా నచ్చకపోయినా దానిపని అది చేసుకుపోతూనే ఉంటుంది. దాంతోపాటు పరుగెత్తినవారు పోటీలో నిలుస్తారు. నాకెందుకు లే అనుకున్న వారు ఆగిపోతారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ వర్తించే మోస్ట్ అండ్ సింపుల్ థియరీ కూడా ఇదే. నిజం చెప్పాలంటే సొసైటీలో ప్రతిదీ మార్పునకు లోబడే ఉంటుంది. ప్రతీక్షణం, ప్రతీ నిమిషం, ప్రతీ గంట, ప్రతీ రోజు కాలమనే నదీ ప్రవాహంలో పయనిస్తూనే ఉంటాయి. అంతెందుకు ఇంకొక్కరోజు గడిస్తే మనం కొత్త సంవత్సరంలోకి మారబోతున్నాం.
కాలమొక్కటే కాదు. మనుషులు, మానవ సంబంధాల్లోనూ అందుకు అనుగుణంగా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా రాబోయే (2024) సంవత్సరంలో 2023లోని ట్రెండ్స్ అన్నీ స్పీడప్ అవుతాయి లేదా మరింత మెరుగైన దిశగా మారుతాయి. అలాంటివాటిలో జన్ డేటింగ్ స్టైల్ కూడా ఒకటి అంటున్నారు నిపుణులు. వచ్చే సంవత్సరం నుంచి న్యూ జనరేషన్ డేటింగ్ ట్రెండ్స్ కాంప్లికేటెడ్ నుంచి సింప్లిసిటీలోకి ప్రవేశిస్తాయని బంబుల్ అండ్ క్వాక్ క్వాక్ వంటి డేటింగ్ యాప్స్ నిర్వాహకుల సర్వేలో వెల్లడైంది. యువత తమ మెంటల్ హెల్త్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే రిలేషన్‌షిప్స్‌పైనే మొగ్గు చూపుతుందని, ఇకపై మినిమమ్ ఎఫర్ట్స్‌ను యాక్సెస్ట్ చేయడానికి ఇష్టపడదని సర్వేలు చెప్తున్నాయి. మొత్తానికి 2024లో సెంటర్ స్టేజ్‌ని తీసుకోబోతున్న కొన్ని ట్రెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం.
ఏజ్‌గ్యాప్.. నో ప్రాబ్లం !
రాబోయే సంవత్సరంలో మనం చూడబోయే బిగ్గెస్ట్ మార్పులలో ఒకటి క్రాస్-జనరేషన్ డేటింగ్ అంటున్నారు నిపుణులు. బంబుల్ యొక్క 2024 డేటింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం.. సర్వే చేయబడిన 25,000 మంది వ్యక్తులలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు డేటింగ్ లేదా సంబంధాలు కొనసాగించడంలో వయస్సు అసలు నిర్వచించే అంశం కాదనే అభిప్రాయం వెల్లడైంది. ఇక క్వాక్‌క్వాక్ డేటింగ్ యాప్ 2024 రిపోర్ట్ కూడా ఇదే ధోరణిని వెల్లడించింది. దాదాపు 20% జన్-జడ్ (Gen Z) , అలాగే టైర్ 1, టైర్ 2 సిటీలలో నివసించే మిలీనియల్స్ కూడా తమ వయస్సువారితోనే కాకుండా తమకు నచ్చితే చాలు, ఏ వయస్సు వారితోనైనా వ్యక్తిగత సంబంధాలు కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఈ పరిస్థితి మోడర్న్ అండ్ ట్రెడీషనల్ వాల్యూస్ యొక్క స్పెషాలిటీని కలగలిపే మరో నయా ట్రెండ్‌కు నిదర్శనమని నిపుణులు చెప్తున్నారు. వయస్సులో తమకంటే చిన్నవారితో లేదా పెద్ద వారితో శృంగారంలో పాల్గొనవద్దని, పెళ్లి చేసుకోవద్దనే నిబంధనలు ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారు. కానీ 2024లో ఇది అస్సలు పట్టించుకోవాల్సిన విషయంగా ఉండకపోవచ్చు అంటున్నాయి డేటింగ్ యాప్స్ సర్వేలు. వయస్సుతో సంబంధం లేకుండా మెచ్యూరిటీ లెవల్‌లో సరిపోతారని భావించినంతకాలం రిలేషన్‌సిప్‌ను కొనసాగించడానికే అత్యధిక మంది మొగ్గు చూపనున్నారట.
భావోద్వేగాలు, మెంటల్ హెల్త్ ప్రయారిటీస్
కొత్త సంవత్సరంలో మరో మార్పు ఏంటంటే.. వ్యక్తుల మధ్య సంభాషణలో ‘స్లో’ అండ్ ‘ఇంటెన్షనల్’ (నెమ్మదిగా మరియు ఉద్దేశ పూర్వకంగా) వంటి పదాలు తరచుగా కనిపిస్తాయి. మెకానికల్ రైట్ స్వైప్స్, మీనింగ్ లెస్ కన్వర్జేషన్స్ చుట్టూ పెరుగుతున్న యాంగ్జైటీని యంగ్ జనరేషన్ సహించే పరిస్థితి ఉండదు. అందుకే ఎక్కువ మంది వ్యక్తులు ప్రజెంట్ భావోద్వేగ లభ్యత కోసం ఎదురు చూస్తున్నారని నివేదికలు చెప్తు్న్నాయి. తాము సురక్షితంగా ఉండటంతోపాటు అర్థం చేసుకోగలిగే సంబంధం కోసం ఎక్కువమంది చూస్తున్నారు. డేటింగ్ యాప్స్ యూజర్లలో అయితే మూడవ వంతు మంది సెక్స్ కంటే భావోద్వేగ సాన్నిహిత్యమే ముఖ్యమని, ఫిజికల్ కనెక్షన్ కంటే కూడా అదే అట్రాక్టివ్‌గా ఉటుందని చెప్తున్నారు.
క్వాక్‌క్వాక్ రిపోర్ట్ ప్రకారం.. 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు గల స్త్రీలలో 33% మంది తమ వ్యక్తిగత, సామాజిక భావాలు, భావోద్వేగాలను షేర్ చేసుకునే.. మానసికంగా సుఖవంతమైన బంధాల వైపు మొగ్గు చూపనున్నారు. మొత్తానికి 2024 ‘జన్ డేటింగ్’ ఇయర్ అవుతుంది. ఇక సింగిల్స్ విషయానికి వస్తే తమ ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి బయటపడుతూ డేటింగ్ స్పేస్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఎక్కుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే.. చాలామంది తమ రిలేషన్‌షిప్, కుటుంబం అంతర్గత విషయాలు బహిర్గతం చేయడానికి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఇష్టపడరట.