Skin Cancer: సబ్బుతో స్కిన్‌ క్యాన్సర్‌కి చెక్‌.. 14 ఏళ్ల బాలుడి సరికొత్త ఆవిష్కరణ

క్యాన్సర్‌ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలిసిందే.

Update: 2023-10-26 17:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్యాన్సర్‌ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలిసిందే. అలాంటి భయానక క్యాన్సర్‌ వ్యాధుల్లో ఒకటి స్కిన్‌ క్యాన్సర్‌. అలాంటి స్కిన్‌ క్యాన్సర్‌ని తక్కువ ఖర్చుతోనే ఈజీగా నయం చేసేలా ఓ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికాడు ఓ టీనేజర్‌. అమెరికాలోని వర్జీనియాకు చెందిన 14 ఏళ్ల హేమన్‌ బెకెలే (Heman Bekele) స్కిన్‌ క్యాన్సర్‌ని జయించేలా సబ్బుని కనిపెట్టాడు. తక్కువ ఖర్చతోనే నయం అయ్యేలా రూపొందించాడు. ఈ సబ్బు ధర కేవలం రూ. 800/- మాత్రమే. ఈ సరికొత్త ఆవిష్కరణకు టాప్‌ యంగ్‌ సైంటిస్ట్‌గా అవార్డును గెలుచుకున్నాడు. ఆ బాలుడికి ఈ ఆవిష్కరణను కనుగొనడానికి త్రీఎం డిస్కవరరీ ఎడ్యుకేషన్‌ శాస్త్రవేత్తల సలహాదారు డాక్టర్‌ మహ్ఫుజా అలీ సాయం చేశారు.


హేమన్‌ బెకెలే.. యూఎస్‌లో ఏటా నిర్వహించే 2023 3M యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. దాదాపు తొమ్మిది మంది పోటీ పడిన ఈ చాలెంజ్‌లో అమెరికా టాప్‌ యంగ్‌ సైంటిస్ట్‌గా విజయం కైవసం చేసుకుని దాదాపు రూ. 31 లక్షల ఫ్రైజ్‌ మనీని గెలుచుకున్నాడు. ఇథియోపియాకు చెందిన బెకెలే తాను అక్కడ ఉన్నప్పుడు చాలామంది స్కిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతుండటం చూశానని చెప్పుకొచ్చాడు. అప్పుడే దీన్ని నయం చేసేలా ఏదైనా కనిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు. బెకెలే రూపొందించిన ఈ సబ్బు పేరు 'స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్' సోప్. ఈ సోప్‌ చర్మాన్ని రక్షించే డెన్డ్రిటక్‌ కణాలను పునరుద్ధరింంచి, స్కిన్‌ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతుందని బెకెలే పేర్కొన్నాడు. ఇంతవరకు మార్కెట్‌లో స్కిన్‌ క్యాన్సర్‌కి సంబంధించి క్రీమ్‌లు మాత్రమే మార్కెట్‌లో ఉన్నాయని.. సబ్బుని ఉపయోగించడం ఇదే తొలిసారి అని యంగ్‌ ఛాలెంజ్‌ ప్రెజెంటేషన్‌ ప్యానల్‌ వివరించాడు బెకెలే.

Tags:    

Similar News