Dry chilies: ఎండుమిర్చితో 12 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
భారతీయులు వంటకాల్లో కారాన్ని ఎక్కువగా వాడుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: భారతీయులు వంటకాల్లో కారాన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఎండుమిర్చి కారాన్ని తింటే కడుపులో మంట వస్తుందని పలు ప్రాంతాల వారు కారం వాడకాన్ని తగ్గించారు. ప్రజెంట్ డేస్‌లో చాలా మంది చప్పగా తినడానికి అలవాటు పడిపోతున్నారు. కానీ ఎండుమిర్చి కారం తింటే అనేక లాభాలు ఉన్నాయే తప్ప నష్టాలేమీ లేవంటున్నారు నిపుణులు. కారం తినడం వల్ల 12 అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఎండుమిర్చి కారం తింటే మెటబాలిజాన్ని పెంచుతుంది. కేలరీలు ఫాస్ట్‌గా కరిగేలా చేస్తుంది. ఎండుమిర్చిలోని క్యాప్సైసిన్, బాడీలోని వాపును తగ్గించడంలో మేలు చేస్తుంది. విటమిన్ ఎ, సి, ఇ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ కారం కెలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. జీర్ణ రసాలను ఉత్పత్తి చేసి స్మూత్ జీర్ణక్రియకు ఎండుమిర్చి సహకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.
అధిక బరువుతో బాధపడేవారికి ఎండుమిర్చి ఒక వరం. కారం తింటే కొవ్వు కరిగిపోతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే క్యాప్సైసిన్ కారణంగా మిరపకాయను నొప్పి తగ్గించే క్రీముల్లో ఉపయోగిస్తారు. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో, ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్నికాంతివంతంగా ఉంచడంలో ఎంతో మేలు చేస్తాయి. అలర్జీని తగ్గిస్తుంది.ఎండుమిర్చి మనోధైర్యాన్ని పెంచుతుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.