పదో తరగతి పరీక్షలు స్టార్ట్.. విద్యార్థులు ఈ టిప్స్ పాటిస్తూ ఏకాగ్రత పెంచుకోండి !

పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు మొదలు అవుతున్నాయి. దీంతో విద్యార్థులు కాస్త భయానికి స్ట్రెస్‌కు గురి అవుతుంటారు. ఎగ్జామ్స్ టెన్షన్‌లో పడి సరిగ్గా తినరు.దీంతో అనారోగ్యం బారినపడే అవకాశం ఉంటుంది

Update: 2024-03-17 09:50 GMT

దిశ, ఫీచర్స్ : పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు మొదలు అవుతున్నాయి. దీంతో విద్యార్థులు కాస్త భయానికి స్ట్రెస్‌కు గురి అవుతుంటారు. ఎగ్జామ్స్ టెన్షన్‌లో పడి సరిగ్గా తినరు.దీంతో అనారోగ్యం బారినపడే అవకాశం ఉంటుంది. అందువలన పరీక్షల సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, మంచి ఆహారం పెట్టాలి. ఎందుకంటే వారి ఆరోగ్యం బాగుంటే, ఎగ్జామ్స్ బాగా రాస్తారు. అందువలన పేరెంట్స్ మంచి డైట్ ప్లాన్ చేసి,వారికి సరైన సమయంలో సరైన ఫుడ్ పెట్టడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వారిలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అందువలన కొన్ని టిప్స్ ఫాలో అవుతూ వారికి మంచి ఫుడ్ పెడుతూ, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడంలో సహాయపడాలి అంటున్నారు నిపుణులు. అంతే కాదు మంచి ఫుడ్‌తో విద్యార్థులు ఏకాగ్రత కూడా పెంచుకోవచ్చు. కాగా ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎందుకంటే, సమ్మర్ కాబట్టి బాడీ త్వరగా డీహైడ్రేషన్‌కు గురి అవుతోంది. దీంతో ఎక్జామ్ మీద కాన్సంట్రేషన్ చేయలేరు. అందువలన బాడీ డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడూ వాటర్ తాగుతూ ఉండాలి. దీని వలన ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

  • కొంత మంది విద్యార్థులు ఎగ్జామ్ టెన్షన్, భయానికి ఉదయం టిఫిన్ చేయకుండానే పరీక్ష హాల్‌కి వెళ్తారు. కాగా, స్టూడెంట్స్ ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉండకూడదు. దీని వలన ఆకలిగా అనిపించి ఎగ్జామ్ బాగా రాయలేరు. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి.

  • టెన్త్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు, ఎక్కువగా పండ్లు తీసుకోవాలి. స్పైసీ ఫుడ్ అస్సలే తీసుకోకూడదు. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వలన పరీక్ష సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.అందువలన ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

  • పదో తరగతి హాజరయ్యే విద్యార్థులు పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరంగా చదువుతుంటారు. అయితే, వీరు మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు, ఈ పరీక్షల సమయంలో హెవీగా తినకుండా జాగ్రత్తపడాలి. ఏది తీసుకున్నా చిన్న మొత్తంలో తీసుకోవాలి. లేకపోతే కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు వస్తాయి.

Similar News