జీడిపప్పును ఈ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే.. మీ కోరికలు త్వరగా నెరవేరతాయట!
ప్రత్యేక రోజులు దేవుళ్లకు అంకితం చేయబడ్డాయి.
దిశ, ఫీచర్స్: హిందూ మతంలో మూడుకోట్ల దేవతలు ఉన్నారని ప్రజలు నమ్ముతుంటారు. ప్రతి దేవుడికి వారానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. వివిధ పండుగలు, ప్రత్యేక రోజులు దేవుళ్లకు అంకితం చేయబడ్డాయి. ఆ పవిత్రమైన రోజున యాగాలతో పూజపురస్కారాలు చేస్తుంటారు. భగవంతుడికి ఇష్టమైన ప్రసాదాన్ని సమర్పిస్తారు. అయితే, హిందూ పురాణాల ప్రకారం, జీడిపప్పును కూడా దేవుళ్లకు సమర్పిస్తారట. ఇలా చేయడం పట్టిన దరిద్రం తొలగిపోతుందనే నమ్ముతుంటారు. మనం ఏ దేవుళ్లకు జీడిపప్పును ప్రసాదంగా సమర్పించవచ్చో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..
గణేశుడికి జీడిపప్పు నైవేద్యంగా పెట్టవచ్చు. ఆయనకు ఇష్టమైన ప్రసాదం మోదకం, ఉండ్రాళ్ళని మనందరికీ తెలుసు. అందుకే వినాయకచవితి సందర్భంగా వాటిని గణేశుడికి సమర్పిస్తాం. అయితే బుధవారం నాడు విఘ్నేశ్వరుని పూజ సమయంలో జీడిపప్పును కూడా నైవేద్యంగా పెట్టండి. ఇది ప్రజల గ్రహ దోషాలన్నింటినీ తొలగిస్తుంది. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కోరిన కోరికలను గణపతి తీరుస్తాడు.
శివునికి జీడిపప్పును ప్రసాదంగా సమర్పించడం చాలా శ్రేయస్కరం. సోమవారం పూజలో పూలు, పండ్లతోపాటు జీడిపప్పును కూడా ప్రసాదంగా పెట్టొచ్చు. ఇలా చేయడం వలన శివుని అనుగ్రహం మీపై ఉంటుంది. శివపూజలో పసుపు, సింధూరం, తులసి వంటివి ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేస్తే శివుడికి కోపం వస్తుంది.