లైసెన్స్ రెన్యూవల్ ఐదేండ్లకు పెంచాలి
దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ కాంట్రాక్టర్ల లైసెన్స్ రెన్యూవల్ గడువు మూడేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. హైదరాబాద్ లో ఆదివారం మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్కే మాజిద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా లైసెన్స్ రెన్యూవల్ గడువును రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచారని గుర్తుచేశారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు […]
దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ కాంట్రాక్టర్ల లైసెన్స్ రెన్యూవల్ గడువు మూడేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. హైదరాబాద్ లో ఆదివారం మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్కే మాజిద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా లైసెన్స్ రెన్యూవల్ గడువును రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచారని గుర్తుచేశారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అసోసియేషన్ రుణపడి ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమల్లోకి తెచ్చిందని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో గడువును పెంచినట్లుగానే లైసెన్స్ రెన్యూవల్ గడువును మూడు నుంచి ఐదు సంవత్సరాలకు పెంచాలని మంత్రి జగదీష్ రెడ్డికి విజ్ణప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాలు, నాగర్‌కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.