థర్డ్ జెండర్ల కోసం LIC కొత్త ప్లాన్
దిశ, వెబ్‌డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సోమవారం నాన్-లింక్డ్, నాన్ పార్టిసిటింగ్, వ్యక్తిగత పొదుపు జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. LIC కొత్త ప్లాన్ పేరు ధన్ రేఖ. దీనిని 13 డిసెంబర్ 2021 నుండి అమలులోకి తెచ్చింది. స్త్రీలకు ప్రత్యేక ప్రీమియం రేట్లను పొందుపరిచింది. థర్డ్ జెండర్‌కు ఈ ప్లాన్ వర్తిస్తుందని బీమా సంస్థ తెలిపింది. ధన్ రేఖ, పాలసీ అమల్లో ఉన్నట్లయితే, ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినప్పటి నుండి క్రమమైన […]
దిశ, వెబ్‌డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సోమవారం నాన్-లింక్డ్, నాన్ పార్టిసిటింగ్, వ్యక్తిగత పొదుపు జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. LIC కొత్త ప్లాన్ పేరు ధన్ రేఖ. దీనిని 13 డిసెంబర్ 2021 నుండి అమలులోకి తెచ్చింది. స్త్రీలకు ప్రత్యేక ప్రీమియం రేట్లను పొందుపరిచింది. థర్డ్ జెండర్‌కు ఈ ప్లాన్ వర్తిస్తుందని బీమా సంస్థ తెలిపింది. ధన్ రేఖ, పాలసీ అమల్లో ఉన్నట్లయితే, ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినప్పటి నుండి క్రమమైన వ్యవధిలో మనుగడ ప్రయోజనంగా ప్రాథమిక హామీ మొత్తంలో కొంత శాతాన్ని ప్లాన్ అందిస్తుందని LIC తెలిపింది.
పాలసీ వ్యవధిలో పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే కుటుంబానికి ఈ ప్లాన్ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. హామీ ఇవ్వబడిన మొత్తంలో 125 శాతం, ఇతర బెనిఫిట్స్ అందిస్తారు. ఈ ప్లాన్ కింద కనీస హామీ మొత్తం రూ.2 లక్షలు, గరిష్ట హామీ మొత్తానికి పరిమితి లేదు. పాలసీలో చేరడానికి కనీస వయస్సు 90 రోజుల నుండి 8సంవత్సరాల వరకు ఉంటుంది. గరిష్ట వయస్సు 35 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు ఉంటుంది, ఇది పాలసీ కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాల కోసం దగ్గరలోని LIC కార్యాలయాన్ని సంప్రదించగలరు.