వారికి గుడ్ న్యూస్ : రోజుకు రూ. 29 పెట్టుబడితో రూ.4 లక్షల ఆదాయం
దిశ, వెబ్‌డెస్క్ : ప్రజల కోసం ఎల్ఐసీ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను తీసుకొస్తుంది. భారతీయ జీవిత భీమా నుంచి మరో కొత్త పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పెట్టుబడుల కోసం ‘ఆధార్ శిలా’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం భారతీయ మహిళలలు స్వావలంబన సాధించడానికి తోడ్పడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆధార్ కార్డు ఉన్న మహిళలందరూ ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ తీసుకోవడానికి ఎలాంటి ఆరోగ్య పరీక్షలు అవసరం […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రజల కోసం ఎల్ఐసీ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను తీసుకొస్తుంది. భారతీయ జీవిత భీమా నుంచి మరో కొత్త పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పెట్టుబడుల కోసం ‘ఆధార్ శిలా’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం భారతీయ మహిళలలు స్వావలంబన సాధించడానికి తోడ్పడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆధార్ కార్డు ఉన్న మహిళలందరూ ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ తీసుకోవడానికి ఎలాంటి ఆరోగ్య పరీక్షలు అవసరం లేదు. మరి ఇందులో పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఎంత కాలానికి ఎంత రిటర్న్ వస్తుంది, ఒక వేళ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినా డబ్బులు వస్తాయా అనే విషయాలను తెలుసుకుందాం.
అర్హతలు..
-
ఈ పాలసీ కేవలం మహిళలకు మాత్రమే.
-
8 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు.
-
ఆధార్ కార్డు తప్పనిసరి.
-
పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు కాగా గరిష్ట వయస్సు 20 ఏళ్లు.
ఆధార్ శిలా పథకం ద్వారా ఎల్ఐసీ మహిళలకు తీపి కబురు అందించింది. ఈ పాలసీ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ పాలసీ తీసుకోవాలంటే పై తెలిపిన వయస్సున్న మహిళలు ఈ పాలసీకి అర్హులు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి మెచ్యూరిటీ సమయంలో 4 లక్షలు రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇందుకు 20 సంవత్సరాల వరకు, రోజుకి 29రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. అంటే సంవత్సరానికి 10585 మాత్రమే. దీనికి 4.5% పన్ను కలిపితే రూ.10,959 అవుతుంది. ఇలా వరసగా 20 సంవత్సరాల పాటు మనం మొత్తం రూ.2,14,696 చెల్లించాలి. కానీ మెచ్యూరిటీ తీరాక ఎల్ఐసీ నుండి మనకి అక్షరాల 4 లక్షలు రూపాయలు లభిస్తాయి. అంటే సగానికి సగం లాభం వస్తుందన్నట్టు. అంతే కాకుండా పాలసీ ముగిసేలోపు పాలసీ తీసుకున్న మహిళ చనిపోతే ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ప్రీమియం తక్కువగా ఉంటుంది. పాలసీ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మరణిస్తే లాయల్టీ అడిషన్ కూడా లభిస్తుంది. ఇందులో పెట్టుబడిదారులు తమ ప్రీమియం నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి చెల్లించొచ్చు. ఏడాది ప్రీమియం ఎంచుకుంటే 2 శాతం ప్రీమియం తగ్గుతుంది.