హీరో సూర్యపై చర్యలు తీసుకోవాల్సిందే !
దిశ, వెబ్‌డెస్క్: నీట్ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు అనుమతి తీర్పును తప్పుబడుతూ హీరో సూర్య చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు హైకోర్టు జడ్జి ఎస్ఎం సుబ్రహ్మణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. మీడియాలో సూర్య వ్యాఖ్యలు చూశాన్న జడ్జి.. ఆయన వ్యాఖ్యలు న్యాయవస్థను కించపరిచేలా ఉన్నాయని, కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధోరణి న్యాయవ్యవస్థపై విశ్వాసానికి ముప్పుగా మారుతుందని, వెంటనే చర్యలు ప్రారంభించి న్యాయవ్యవస్థ ఘనతను చాటి చెప్పాలని తెలిపారు. కరోనా […]
దిశ, వెబ్‌డెస్క్: నీట్ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు అనుమతి తీర్పును తప్పుబడుతూ హీరో సూర్య చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు హైకోర్టు జడ్జి ఎస్ఎం సుబ్రహ్మణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. మీడియాలో సూర్య వ్యాఖ్యలు చూశాన్న జడ్జి.. ఆయన వ్యాఖ్యలు న్యాయవస్థను కించపరిచేలా ఉన్నాయని, కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధోరణి న్యాయవ్యవస్థపై విశ్వాసానికి ముప్పుగా మారుతుందని, వెంటనే చర్యలు ప్రారంభించి న్యాయవ్యవస్థ ఘనతను చాటి చెప్పాలని తెలిపారు.
కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయం చేస్తున్న న్యాయమూర్తులు.. విద్యార్థులను మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరమంటూ హీరో సూర్య ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తమిళనాడులో ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పట్ట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త విని తన గుండె పగిలినంత పనైందన్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన సమయంలో ఓదార్పు చెప్పాల్సి రావడం సిగ్గుచేటని చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది.
Read Also…