జనతా కర్ఫ్యూలో పాల్గొందాం : అర్వింద్
దిశ, నిజామాబాద్: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆదివారం జనతా కర్ప్యులో అందరం పాల్గొని సహకరిద్దామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. శనివారం పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందరూ ఇంట్లోనే ఉండాలి, అత్యవసర పరిస్థితులుంటేనే బయటకి రావాలని సూచించారు. ఏప్రిల్ 15 వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, శుభకార్యాలు కొద్దీ రోజులు వాయిదా వేసుకోవాలన్నారు.సీఎం కేసీఆర్ కరోనా నివారణ కోసం బార్లు, స్కూళ్ళు మూయిస్తే ఆయన కూతురు కవిత మాత్రం ఎన్నికల […]
దిశ, నిజామాబాద్: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆదివారం జనతా కర్ప్యులో అందరం పాల్గొని సహకరిద్దామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. శనివారం పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందరూ ఇంట్లోనే ఉండాలి, అత్యవసర పరిస్థితులుంటేనే బయటకి రావాలని సూచించారు. ఏప్రిల్ 15 వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, శుభకార్యాలు కొద్దీ రోజులు వాయిదా వేసుకోవాలన్నారు.సీఎం కేసీఆర్ కరోనా నివారణ కోసం బార్లు, స్కూళ్ళు మూయిస్తే ఆయన కూతురు కవిత మాత్రం ఎన్నికల కోసం క్యాంపు నిర్వహించటం దురదృష్టకరం అని విమర్శించారు. హైదరాబాద్ షామిర్‌పేట్‌లోని ఆ క్యాంపులో పలువురు సభ్యులకు అనారోగ్యం ఉన్నట్టు తెలిసిందన్నారు. టీఆర్‌ఎస్‌కే మెజారిటీ ఉన్నా క్యాంపు రాజకీయాలు చేయడం కవిత అసహనానికి నిదర్శనమన్నారు. కరోనా విస్తృతిని అడ్డుకునే విషయంలో ప్రజలంతా ఒకవైపు ఉంటే కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి మరోవైపు ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్యాంపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఒకవైపు ప్రధాని జనతా కర్ఫ్యూ అంటుంటే టీఆర్ఎస్ మాత్రం క్యాంపు పేరుతో ప్రజాప్రతినిధుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలపై కేసీఆర్ స్పందించాలని తెలిపారు.
Tags : Let’s join, Janata curfew, nizamabad mp Arvind, pm modi, ex mp kavitha, corona virus