కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం: డీకే అరుణ

దిశ, మహబూబ్‌నగర్: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి డి.కె.అరుణ అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ కరోనాను ఎదుర్కోవాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్‌తో అరుణ ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో ఒక్కరోజే 7 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాకు ప్రత్యేకంగా టెస్టింగ్ కిట్స్‌ను పంపించి గద్వాల‌లోనే కరోనా […]

Update: 2020-04-18 23:24 GMT

దిశ, మహబూబ్‌నగర్: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి డి.కె.అరుణ అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ కరోనాను ఎదుర్కోవాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్‌తో అరుణ ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో ఒక్కరోజే 7 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాకు ప్రత్యేకంగా టెస్టింగ్ కిట్స్‌ను పంపించి గద్వాల‌లోనే కరోనా పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags: dk aruna, minister etela, special testing kits, gadwal

Tags:    

Similar News