అమ్మకానికి చిరుతపులి మాంసం.. ఐదుగురు అరెస్టు!

దిశ, వెబ్‌‌డెస్క్ : క్రూరమృగాలు ఆహారం కోసం తోటి జంతువులను వేటాడుతాయని అందరికీ తెలిసిందే. కానీ, నేటి సమాజంలోని మనుషులు క్రూరమృగాల కంటే భయంకరంగా తయారవుతున్నారు. కేవలం తమ స్వార్థం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వెనుకాడటం లేదు. చివరకు క్రూరమృగాలను సైతం వేటాడేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉంటున్న ఐదుగురు వ్యక్తులు ఆరు సంవత్సరాల వయస్సున్న చిరుతపులిని హతమార్చారు. అనంతరం […]

Update: 2021-01-23 05:06 GMT

దిశ, వెబ్‌‌డెస్క్ : క్రూరమృగాలు ఆహారం కోసం తోటి జంతువులను వేటాడుతాయని అందరికీ తెలిసిందే. కానీ, నేటి సమాజంలోని మనుషులు క్రూరమృగాల కంటే భయంకరంగా తయారవుతున్నారు. కేవలం తమ స్వార్థం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వెనుకాడటం లేదు. చివరకు క్రూరమృగాలను సైతం వేటాడేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికంగా ఉంటున్న ఐదుగురు వ్యక్తులు ఆరు సంవత్సరాల వయస్సున్న చిరుతపులిని హతమార్చారు. అనంతరం దాని మాంసాన్ని విక్రయానికి పెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే నిందితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించగా.. చిరుతపులి చర్మం, దంతాలు, గోర్లు, మాంసం లభ్యమయ్యాయి. అంతేకాకుండా సగం మాంసాన్ని నిందితులు వండుకుని తిన్నట్లు గుర్తించారు. మిగతా వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News