ములుగు మన్యంలో చిరుత సంచారం
దిశ, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం మన్యం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఏజెన్సీ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే పలుసార్లు పశువులపై దాడి చేయడంతో జనాలు మరింత భయపడుతున్నారు. కొంగల జలపాతం సరిహద్దులోనే చిరుత సంచారం చేస్తోందని.. అటువైపు వెళ్లోద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పులి ఆనవాళ్లు గుర్తించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అడవిలో ఇప్పటికే డ్రాఫ్ట్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి.. చిరుత కదలికలపై నిఘా […]
దిశ, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం మన్యం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఏజెన్సీ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే పలుసార్లు పశువులపై దాడి చేయడంతో జనాలు మరింత భయపడుతున్నారు. కొంగల జలపాతం సరిహద్దులోనే చిరుత సంచారం చేస్తోందని.. అటువైపు వెళ్లోద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పులి ఆనవాళ్లు గుర్తించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అడవిలో ఇప్పటికే డ్రాఫ్ట్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి.. చిరుత కదలికలపై నిఘా పెంచారు. అయినప్పటికీ చిరుత చిక్కలేదు. దీంతో తమను రక్షించాలంటూ ఏజెన్సీ ప్రాంత వాసులు వేడుకుంటున్నారు.