పుర వీధుల్లో పులి సంచారం…

దిశ వెబ్ డెస్క్: తిరుమల పుర వీధుల్లో వన్య ప్రాణులు దర్శనమిస్తున్నాయి. నిత్యం భక్తుల రద్దీతో కిటకిట లాడే తిరుమల క్షేత్రం కరోనా నేపథ్యంలో మూతపడింది. ఆ తర్వాత తిరిగి తెరుచుకున్నా స్వామి వారిని దర్శించుకునేందుకు మునపటిలాగా భారీ సంఖ్యలో భక్తులు రావడం లేదు. ఇక భక్తుల రద్దీ తగ్గడంతో తిరుమల వీధుల్లో జంతువులు నిర్భయంగా సంచరిస్తున్నాయి. తాజాగా శ్రీ వారి మ్యూజియం వద్ద నిన్న ఓ చిరుత పులి సంచరించినట్టు వెల్లడైంది. మాడ వీధికి సమీపంలో […]

Update: 2020-09-02 08:50 GMT

దిశ వెబ్ డెస్క్: తిరుమల పుర వీధుల్లో వన్య ప్రాణులు దర్శనమిస్తున్నాయి. నిత్యం భక్తుల రద్దీతో కిటకిట లాడే తిరుమల క్షేత్రం కరోనా నేపథ్యంలో మూతపడింది. ఆ తర్వాత తిరిగి తెరుచుకున్నా స్వామి వారిని దర్శించుకునేందుకు మునపటిలాగా భారీ సంఖ్యలో భక్తులు రావడం లేదు. ఇక భక్తుల రద్దీ తగ్గడంతో తిరుమల వీధుల్లో జంతువులు నిర్భయంగా సంచరిస్తున్నాయి. తాజాగా శ్రీ వారి మ్యూజియం వద్ద నిన్న ఓ చిరుత పులి సంచరించినట్టు వెల్లడైంది. మాడ వీధికి సమీపంలో ఉన్న మ్యూజియం వద్ద గోడపై చిరుత కూర్చుని, తర్వాత అక్కడే కొద్ది సేపు సంచరించింది. అనంతరం చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత పులి సంచారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News