భయం భయం.. చెట్టెక్కిన చిరుత చిక్కేదెట్లా..?
దిశ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగల గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుంది. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో చిరుతపులి చెట్టుపైకి ఎక్కగా, స్థానిక యువకులు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. చిరుత పులి సంచరిస్తుందని తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని నిఘా కెమెరాలు ఏర్పాటు […]
దిశ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగల గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుంది. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో చిరుతపులి చెట్టుపైకి ఎక్కగా, స్థానిక యువకులు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. చిరుత పులి సంచరిస్తుందని తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ విషయమై డీఎఫ్ వో ప్రదీప్ కుమార్‌ను సంప్రదించగా ప్రస్తుతం చిరుత పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని, చిరుతపులి మూమెంట్ ట్రాక్ చేస్తున్నామని, స్థానికులు ఎటువంటి ఆందోళన చెందొద్దని, జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.