ఆమనగల్ మండలంలో చిరుత దాడి

దిశ, కల్వకుర్తి: లాక్‌డౌన్ సమయంలో జనారణ్యంలోకి పులులు వచ్చి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నే ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమన్‌గల్ మండల పరిధిలో ఓ చిరుత పులి కలకలం రేపుతోంది. రాంనుంతల గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో బర్రె దూడను కట్టేసి ఇంటికి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున దూడకు మేత వేయడానికి వెళ్లే సరికి చిరుత పులి దాడిలో ఆ దూడ […]

Update: 2020-07-09 06:34 GMT

దిశ, కల్వకుర్తి: లాక్‌డౌన్ సమయంలో జనారణ్యంలోకి పులులు వచ్చి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నే ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమన్‌గల్ మండల పరిధిలో ఓ చిరుత పులి కలకలం రేపుతోంది. రాంనుంతల గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో బర్రె దూడను కట్టేసి ఇంటికి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున దూడకు మేత వేయడానికి వెళ్లే సరికి చిరుత పులి దాడిలో ఆ దూడ మృతి చెందింది. పులి భయంతో ఇతర రైతులు కూడా పంట పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు.

Tags:    

Similar News