ఈ ఏడాది పీసీ మార్కెట్లో లెనొవో 30 శాతం వృద్ధి!

దిశ, వెబ్‌డెస్క్: కంపెనీలు, విద్యారంగంలో ఆన్‌లైన్ క్లాసుల నుంచి డిమాండ్ భారీగా పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పర్సనల్ కంప్యూటర్(పీసీ)ల తయారీ సంస్థలెనొవో 25-30 శాతం వృద్ధిని సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి తగ్గొచ్చనిలెనొవో ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ అగర్వాల్ చెప్పారు. అదేసమయంలో కంపెనీ ఎప్పుడూ రెండంకెల వృద్ధినే నమోదు చేసిందని, ఈ ధరోణిని కొనసాగిస్తుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో […]

Update: 2021-01-03 06:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: కంపెనీలు, విద్యారంగంలో ఆన్‌లైన్ క్లాసుల నుంచి డిమాండ్ భారీగా పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పర్సనల్ కంప్యూటర్(పీసీ)ల తయారీ సంస్థలెనొవో 25-30 శాతం వృద్ధిని సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి తగ్గొచ్చనిలెనొవో ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ అగర్వాల్ చెప్పారు. అదేసమయంలో కంపెనీ ఎప్పుడూ రెండంకెల వృద్ధినే నమోదు చేసిందని, ఈ ధరోణిని కొనసాగిస్తుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ట్యాబ్లెట్ల తయారీ ప్రారంభించాలని, ల్యాప్‌టాప్ తయారీనికి దాదాపు 10 రెట్లు విస్తరించే చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. బిజినెస్ టు బిజినెస్ డిమాండ్ ప్రస్తుతానికి నెమ్మదించిందని, పూర్తి ఏడాదికి 4-5 శాతం మాత్రమే పెరుగుతుందని రాహుల్ అగర్వాల్ చెప్పారు. ఇటీవల మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకారం..డెస్క్‌టాప్, నోట్‌బుక్, వర్క్ స్టేషన్లు సహా దేశీయంగా పీసీ మార్కెట్ సెప్టెంబర్ త్రైమాసికంలో 9.2 శాతం వృద్ధి సాధించిందని, దీనికి ప్రధానంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల డిమాండ్ కారణమైందని ఐడీసీ వెల్లడించింది.

 

Tags:    

Similar News