భర్తల సెక్స్ డామినెన్స్‌పై చర్చించిన ‘లీగల్లీ రేప్‌డ్’
దిశ, సినిమా: స్కూల్.. తొమ్మిదో తరగతి.. ఏ సెక్షన్.. ఫస్ట్ బెంచ్.. బ్యూటిఫుల్ గర్ల్.. అప్పుడే తనకు ఫస్ట్ పీరియడ్.. స్కర్ట్‌కు మార్క్.. తనవైపు రోజూ ప్రేమగా చూసే అదే క్లాస్‌కు చెందిన అబ్బాయి ఆ విషయాన్ని గమనించాడు. క్లాస్ కంటిన్యూ అవుతున్నా టీచర్‌కు చెప్పకుండానే తనను బయటకు తీసుకొచ్చాడు. సైకిల్‌పై అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. అప్పుడు అమ్మాయికి అర్థమైంది.. తనంటే ఆ అబ్బాయికి ఎంత కేర్ అని. స్కూల్, కాలేజీలోనూ ఇద్దరు కలిసే […]
దిశ, సినిమా: స్కూల్.. తొమ్మిదో తరగతి.. ఏ సెక్షన్.. ఫస్ట్ బెంచ్.. బ్యూటిఫుల్ గర్ల్.. అప్పుడే తనకు ఫస్ట్ పీరియడ్.. స్కర్ట్‌కు మార్క్.. తనవైపు రోజూ ప్రేమగా చూసే అదే క్లాస్‌కు చెందిన అబ్బాయి ఆ విషయాన్ని గమనించాడు. క్లాస్ కంటిన్యూ అవుతున్నా టీచర్‌కు చెప్పకుండానే తనను బయటకు తీసుకొచ్చాడు. సైకిల్‌పై అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. అప్పుడు అమ్మాయికి అర్థమైంది.. తనంటే ఆ అబ్బాయికి ఎంత కేర్ అని. స్కూల్, కాలేజీలోనూ ఇద్దరు కలిసే చదువుకున్నారు. అప్పుడు కూడా తనను అంతే కేర్‌తో చూసుకున్నాడు అబ్బాయి. చదువులో సక్సెస్ అయిన ఆ ఇద్దరూ జాబ్స్ సంపాదించారు. ఆ అమ్మాయి అప్పుడే డిసైడ్ అయింది చేసుకుంటే తననే పెళ్లి చేసుకోవాలని. ఇద్దరు తమ తమ ఇంట్లో చెప్పారు.. అమ్మాయి జాబ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.. పెళ్లి చేసేసుకున్నారు. లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది.. ఆ తర్వాత?
కొన్నాళ్లకు అమ్మాయి రియలైజ్ అవుతుంది. భర్త తనను కేవలం ఒక ఆడబొమ్మగా మాత్రమే చూస్తున్నాడనే విషయం అర్థమవుతుంది. తనను చుట్టుముట్టిన ఆలోచనలు క్రమంగా పెరిగి.. తనతో పడుకునేందుకు మాత్రమే భర్త తనను లీగల్‌గా పెళ్లి చేసుకున్నాడా? అనే స్థాయికి చేరడంతో.. పెళ్లి తర్వాత భర్తను సంతోషంగా ఉంచేందుకు ఫ్రెండ్స్, ఫ్యామిలీని పక్కనపెట్టేసిన ఆ అమ్మాయి, నిజంగా తనొక పిచ్చిదాన్నని ఫీలవుతుంది. భర్త పడుకోవాలనుకున్నప్పుడు ఎస్ చెప్తేనే మంచిది.. లేదు అంటే డైజెస్ట్ చేసుకోలేడు, తన కోరిక తీర్చలేని భార్య ఉండెందుకు లేక ఎందుకు? అనే అహంకారంతో ఎలా పడితే అలా కొట్టేస్తాడు. ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సెక్సువల్లీ హరాస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి ? పుట్టింటికి వెళ్లాలా లేక ఇలాగే లైఫ్ అంతా భరిస్తూ ఉండిపోవాలా? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన తమిళ షార్ట్ ఫిల్మ్ ‘ లీగల్లీ రేప్‌డ్’.
ఓపెనింగ్ సీన్.. ‘వేద, మన జ్ఞాపకాలు గోడ మీద పదిలపరుస్తున్నా.. రా!’ అంటూ గోడకు మేకు కొడుతున్న భర్త.. సోఫాలో కూర్చున్న భార్యను తీసుకుని గోడ దగ్గరకు తీసుకెళ్తాడు. లవ్ ప్రపోజల్ ఫొటో గోడకు తగిలిస్తూ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. లైఫ్‌లో ఇలాంటి మూమెంట్స్‌ను ఫొటో రూపంలో గోడకు తగిలిస్తూనే ఉంటాడు భర్త. కానీ అవన్నీ నిజంగా హ్యాపీ మూమెంట్సేనా? అంటే కాదు.. ఆ ఫొటోల వెనుక అమ్మాయి అనుభవించిన కష్టాలున్నాయి.
గోడ మీద ఫొటోలు చూస్తున్న అమ్మాయికి.. అకేషన్‌ను ఆసరాగా చేసుకున్న భర్త, తను కాదన్నా సరే ఒత్తిడి చేసి అనుభవించి, హ్యాపీగా ఫీల్ అయిన సంఘటనలు గుర్తుకు తెస్తుంటాయి. తను నో చెప్తే ఈగో హర్ట్ అయ్యి.. చెంప చెళ్లుమనిపించి, సిగరెట్‌తో తన ఒంటి నిండా గాయాలు చేసిన సందర్భాలు కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. దీంతో లీగల్ రేప్ అనేది భర్తకు ఓ హ్యాబిట్ అయిపోయిందనుకున్న భార్య.. ఏదేమైనా సరే తన నుంచి వేరుకావాలి అనుకుంటుంది. డైవర్స్ పేపర్స్ భర్తకు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
పుట్టింటికి వెళ్లే సరికి మొహం నిండా గాయాలతో ఉన్న అమ్మాయిని చూసిన అమ్మ.. కాస్త టెన్షన్ పడినా ఏదో కోపంలో చేసి ఉంటాడులే! అంత మంచి అబ్బాయి ఎక్కడైనా దొరుకుతాడా? అంటూ తనను సముదాయిస్తూనే తండ్రికి ఫోన్ చేస్తుంది. కానీ బిడ్డ తన ఒంటినిండా ఉన్న గాయాలను చూపించే సరికి షాక్ అవుతుంది. తన కష్టాలను వింటూ ఏడుస్తూనే మాకెందుకు చెప్పలేదని అడిగిన తల్లికి మరిన్ని ప్రశ్నలతో సమాధానం చెప్తుంది.
ఫస్ట్ పీరియడ్ టైమ్‌లో తన గౌరవాన్ని కాపాడిన వాడు.. లైఫ్ లాంగ్ అంతే గౌరవంగా చూసుకుంటాడు అనుకుంటాం.. కానీ మాన్‌స్టర్‌లా తయారవుతాడని అసలు ఊహించలేం కదా? పెళ్లి చేసుకున్న భర్త శారీరకంగా కలుస్తానంటే వద్దని చెప్పినందుకు కొట్టాడు, అందుకే పుట్టింటికి వచ్చా అంటే ఇరుగు పొరుగువారు నవ్వుతారా లేదా? కానీ ఇదే విషయాన్ని తనకు ప్లస్‌గా మార్చుకున్న భర్తను భరించలేకపోయానని, తనకు మూడ్ వచ్చినప్పుడల్లా చిత్ర హింసలు పెట్టే భర్తతో జీవితాంతం ఉండలేక వచ్చేయడం తప్పు కాదు కదా? అని అడుగుతుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎలా సపోర్ట్ చేస్తారనే విషయాన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ చారులత బి రంగరాజన్. భర్త వైపు నుంచి ప్రేమ కంటే సెక్స్ డామినెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు.. కలిసి ఉండేందుకు తన ప్రేమ ఒక్కటే కారణం కాకూడదని, విడిపోవడం తప్పే కాదని షార్ట్ ఫిల్మ్ ద్వారా మెసేజ్ ఇచ్చారు మేకర్స్. మొత్తానికి సూపర్ బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్‌తో వచ్చిన 16 నిమిషాల ‘లీగల్లీ రేప్‌డ్’ షార్ట్ ఫిల్మ్ చెప్తుందేంటంటే.. ‘నో మీన్స్ నో’. అది గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా కట్టుకున్న భార్య కావచ్చు. రిలేషన్‌లో ఉండేందుకు ప్రేమ ఒక్కటే కారణం కాకూడదు. మ్యారేజ్ అనేది ఒక ఎమోషన్ అయినప్పుడు డైవర్స్ అనేది దానికి రిలీఫ్ అవ్వాలి, ఫ్రీడమ్ ఇచ్చేలా ఉండాలి. అమ్మాయిలకు భర్త దగ్గర బాధ కలిగితే సపోర్ట్ ఇచ్చేందుకు అమ్మానాన్న, తోబుట్టువులు కూడా ఉంటారు. ఖచ్చితంగా న్యూ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు.
డైరెక్టర్ : చారులత బి రంగరాజన్
స్టారింగ్ : అమృత శ్రీనివాసన్, ఆంటోని హాడ్లీ, ప్రీతిష ప్రేమ్ కుమరన్, అముదన్ రామలింగం, విఘ్నేశ్వరన్ ఎస్‌పీ
మ్యూజిక్ : మైత్రి