కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలి
దిశ, హైదరాబాద్: కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం టీఎస్ మెసా రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎస్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఫారూఖ్ అహ్మద్ మాట్లాడుతూ… కరోనా ప్రతి నిత్యం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వ్యాధి బారిన పడిన వారికి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని, హెల్త్ కార్డులు అన్ని […]
దిశ, హైదరాబాద్: కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం టీఎస్ మెసా రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎస్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఫారూఖ్ అహ్మద్ మాట్లాడుతూ… కరోనా ప్రతి నిత్యం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వ్యాధి బారిన పడిన వారికి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని, హెల్త్ కార్డులు అన్ని ఆస్పత్రుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, కరోనా సోకిన ఉద్యోగి ఒక వేళ మృతిచెందితే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలనే తదితర డిమాండ్లను సీఎస్ ముందు ఉంచినట్టు ఆయన తెలిపారు. ఆయా డిమాండ్ల పట్ల సీఎస్ సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.