నెట్‌ఫ్లిక్స్ సినిమాతో డేటా సైన్స్ క్లాసులు

దిశ, వెబ్‌డెస్క్ : 25 మిలియన్ల మందికి డిజిటల్ నైపుణ్యాలు నేర్పించే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన గ్లోబల్ స్కిల్స్ ఇనిషియేటివ్‌లో భాగంగా మరొక లెర్నింగ్ మాడ్యూల్‌ను ఆ సంస్థ విడుదల చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి టెక్నాలజీలకు సంబంధించిన ప్రాథమిక, మూల అంశాలను వివరించనున్నారు. అయితే ఈ అంశాలను నేర్పించడానికి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమా ‘ఓవర్ ద మూన్’ ఇతివృత్తాన్ని మైక్రోసాఫ్ట్ ఆదర్శంగా తీసుకుంది. ఈ సినిమాలోని కథాంశాన్ని మూడు […]

Update: 2020-10-31 06:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : 25 మిలియన్ల మందికి డిజిటల్ నైపుణ్యాలు నేర్పించే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన గ్లోబల్ స్కిల్స్ ఇనిషియేటివ్‌లో భాగంగా మరొక లెర్నింగ్ మాడ్యూల్‌ను ఆ సంస్థ విడుదల చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి టెక్నాలజీలకు సంబంధించిన ప్రాథమిక, మూల అంశాలను వివరించనున్నారు. అయితే ఈ అంశాలను నేర్పించడానికి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమా ‘ఓవర్ ద మూన్’ ఇతివృత్తాన్ని మైక్రోసాఫ్ట్ ఆదర్శంగా తీసుకుంది. ఈ సినిమాలోని కథాంశాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి సంబంధించి ఒక్కో అంశాన్ని ఈ లెర్నింగ్ మాడ్యూల్ ద్వారా నేర్చుకోవచ్చు.

మొదటి భాగంలో ఈ సినిమాలోని ఫే ఫే పాత్ర చేసినట్లుగానే సొంతంగా చంద్రుని మీదకు వెళ్లి, తిరిగి వచ్చే రాకెట్ మిషన్‌ను రూపొందించాలి. ఇందుకోసం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోని పాండాస్ లైబ్రరీని ఉపయోగించి డేటాసెట్‌లను విశ్లేషించాలి. రెండో భాగంలో ఉల్కాపాతాన్ని అంచనా వేయగలగాలి. ఇందుకోసం పైథాన్, వీసీ కోడ్ ఉపయోగించి డేటాసెట్‌లను క్లీన్ చేయాలి. చివరి భాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫొటోలలో ఉన్న వస్తువులను గుర్తించగలగాలి. తద్వారా చంద్రుని మీద ఉన్న ఫే ఫే స్నేహితుడు బంజీని వెతికి పట్టుకోవాలి. సినిమాలో ఫే ఫే మాదిరిగానే సైన్స్ మీద, అంతరిక్షం మీద ఆసక్తి ఉన్న వారికి ఈ డేటాసైన్స్ కాన్సెప్ట్‌లు సులభంగా అర్థమవుతాయి. ఇవి కొంచెం క్లిష్టమైన అంశాలు కాబట్టి ఇలా సినిమా ఆధారంగా చెప్పడం వల్ల సులభంగా అర్థమవుతాయని మైక్రోసాఫ్ట్ తమ బ్లాగులో పేర్కొంది.

Tags:    

Similar News